Google Play Store: యాప్‌ డెవలపర్లకు గూగుల్ హెచ్చరిక.. ప్లే స్టోర్‌లో యూజర్ల ప్రైవసీపై నిర్లక్ష్యం వద్దు!

గూగుల్ ప్లే స్టోర్.. మీరు ఏదైనా యాప్ డెవలప్ చేస్తే.. అది ఎక్కడో స్టోర్‌లో ఉండాలి. అప్పుడే యూజర్లకు డౌన్‌లోడ్ చేసేందుకు వీలుంటుంది.

Google Play Store: యాప్‌ డెవలపర్లకు గూగుల్ హెచ్చరిక.. ప్లే స్టోర్‌లో యూజర్ల ప్రైవసీపై నిర్లక్ష్యం వద్దు!

Google Play Store To Rely On Data Given By App Developers As Part Of New Privacy Plan (1)

Google Play Store : గూగుల్ ప్లే స్టోర్.. మీరు ఏదైనా యాప్ డెవలప్ చేస్తే.. అది ఎక్కడో స్టోర్‌లో ఉండాలి. అప్పుడే యూజర్లకు డౌన్‌లోడ్ చేసేందుకు వీలుంటుంది. అయితే గూగుల్ ప్రత్యేకించి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) అనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది తమ యాప్స్ ప్లే స్టోర్‌లో ఉంచుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎవరైనా ఈ ప్లే స్టోర్‌లోకి సంబంధిత యాప్ సెర్చ్ చేసుకుని మరి డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

అయితే.. ఇందులో అఫీషియల్ యాప్స్ కన్నా ఫేక్ యాప్స్ అధికంగా ఉంటున్నాయి. దాంతో యూజర్లు ఏది ఫేక్ అనేది గుర్తించలేక అలానే డౌన్ లోడ్ చేసేస్తున్నారు. ఫలితంగా ప్రైవసీపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్ విధానం అమల్లోకి రావడంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఏదో ఒక యాప్ తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసేస్తున్నారు. ప్లే స్టోర్‌లోనే లక్షలాది కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి.

Google Play Store To Rely On Data Given By App Developers As Part Of New Privacy Plan (2)

Google Play Store To Rely On Data Given By App Developers As Part Of New Privacy Plan

యూజర్ల అవసరాలను తీర్చే యాప్స్‌ వారి ప్రైవసీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో పర్మిషన్స్‌ యూజర్ల డేటాను యాప్‌ నిర్వాహకులకు చేరుతుందని మరవొద్దు. దీంతో యూజర్ల ప్రైవసీ ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో యాప్‌ డెవలపర్‌ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు. ఎవరితోనైనా షేర్ చేస్తున్నారా లేదా అనే సమాచారాన్ని తప్పకుండా బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

యాప్‌ డెవలపర్స్‌ డేటాను గూగుల్‌ చెక్ చేసి ఆ డేటాను ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ యాప్ నిర్వాహకులు యూజర్ల డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే వెంటనే ఆయా యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. జులై 20 నుంచి డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని ఎలాంటి యాప్‌లనైనా గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం వెల్లడించింది.

Read Also : Google Pixel 6a : ఆపిల్ బాటలో ఆండ్రాయిడ్.. గూగుల్ పిక్సెల్‌ 6a ఫోన్ చార్జర్‌తో రాదట.. ఇదిగో ప్రూఫ్..!