Monkeypox: మంకీపాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు సూచనలు

అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంలో రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు మన దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు.

Monkeypox: మంకీపాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు సూచనలు

Monkeypox

Monkeypox: అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంలో రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు మన దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. కానీ, అనేక దేశాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ముందుగానే కేంద్రం జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

కేసులను గుర్తించడం, ముందుగానే నివారణా చర్యలు తీసుకోవడం, ఇతరులకు సోకకుండా చూడటం వంటి అంశాల్లో రాష్ట్రాలకు సూచనలు చేసింది. కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన వారిని కనీసం 21 రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచడంతోపాటు, రోగిని చివరగా కలిసిన వ్యక్తిని గుర్తించడంతోపాటు, రోగి వాడిన వస్తువులను దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలి. ముఖ్యంగా త్వరగా వ్యాధి సోకే అవకాశం ఉన్నవాళ్లను పేషెంట్లకు దూరంగా ఉంచాలి. రోగి తాకిన వస్తువులకు, రోగి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. కరోనాలాగే రోగిని కలిస్తే జాగ్రత్తగా ఉండాలి. చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్, గ్లోవ్స్ ధరించడం, శానిటైజర్ వాడటం చేయాలి. గర్భిణులను, ఇతర వ్యాధులు ఉన్నవాళ్లను రోగికి దూరంగా ఉంచాలి. పీసీఆర్ టెస్టుల ద్వారా వ్యాధిని గుర్తించాలి. వ్యాధి నమూనా పరీక్షలను పుణేలోని ఐసీఎమ్ఆర్ ల్యాబ్‌కు పంపాలి. వ్యాధి ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులను కూడా జాగ్రత్తగా గమనించాలి.

Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి

జ్వరం, తలనొప్పి, లింఫ్ నోడ్స్ వాపు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే ముందుగానే జాగ్రత్త వహించాలి. మంకీపాక్స్ సోకితే ఎలాంటి చికిత్స అందించాలో కూడా కేంద్రం పేర్కొంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లే వాళ్లకు కూడా పలు సూచనలు చేసింది. అక్కడ రోగులకు, రోగ లక్షణాలు ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే ఎలుకలు, ఉడుతలు, కోతులు వంటి జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.