Tamilnadu : టీచరేనా ? విద్యార్థిని కాలితో తన్నుతూ..కర్రతో చావబాదాడు..వీడియో వైరల్

విద్యార్థిపై దాష్టీకానికి పాల్పడ్డాడో ఓ టీచర్. విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు. కాళ్లతో తన్నుతూ..కర్రతో బాదాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Tamilnadu : టీచరేనా ? విద్యార్థిని కాలితో తన్నుతూ..కర్రతో చావబాదాడు..వీడియో వైరల్

Tamilnadu

Govt School Teacher Beating : విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే వారికి నచ్చచెప్పి..సన్మార్గంలో తీసుకరావాల్సిన బాధ్యత గురువులది. కానీ..చిన్న చిన్న కారణాలకే..విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి వారిపైకి దాడులకు కూడ దిగుతున్నారు. కాళ్లతో తన్నుతూ..ముష్టిఘాతాలు కురిపిస్తూ..కర్రతో బాదుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Read More : Amith Shah : పాక్ కు అమిత్ షా వార్నింగ్..చర్చల్లేవ్,సర్జికల్ స్ట్రైక్స్ తోనే సమాధానమిస్తాం

కరోనా కారణంగా..చదువులు ఆగమాగమైపోయాయి. గత రెండేళ్లుగా స్కూళ్లు..కాలేజీలు తెరకపోవడంతో విద్యార్థులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా కంట్రోల్ వచ్చేసరికి విద్యాలయాలు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన వారు…బ్యాగులు వేసుకుని స్కూళ్లకు వెళుతున్నారు. కొంతమంది అలవాటు తప్పేసరికి కొన్ని తప్పులు చేస్తున్నారు విద్యార్థులు. ఇలాగే ఓ విద్యార్థి చేశాడు. క్లాసులకు సరిగ్గా రావడం లేదు. నచ్చచెప్పాల్సిన ఆ గురువు అతడిని చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Telangana cancer cases : తెలంగాణలో 30 ఏళ్లలో 50 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు..

తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఓ విద్యార్థి క్లాసులకు సరిగ్గ రావడం లేదని టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతికి వచ్చిన ఆ స్టూడెంట్ ను దగ్గరికి పిలిచాడు. ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..చేతిలో ఉన్న కర్రతో బాదాడు. బాధలకు తాళలేక కింద కూర్చొండిపోయాడు ఆ విద్యార్థి. ఆయన వదల్లేదు ఆ టీచర్. కాళ్లతో తొడలపై తన్నాడు. కర్రతో వెనుకవైపున కొట్టాడు. ఇదంతా క్లాస్ లో ఉన్న ఓ స్టూడెంట్ వీడియో తీశాడు. అది కాస్తా..వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఇలా కొట్టి హింసించడం సబబు కాదని, టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వీడియో విద్యార్థులతో పాటు..టీచర్ కూడ మాస్క్ లు పెట్టుకోకపోవడం కనిపించింది.