Online Games: ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ

ఆన్‌లైన్ గేమ్స్‌ను నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

Online Games: ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణకు కమిటీ

Online Games

Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌ను నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ గేమ్స్‌ను ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తేవాలో కూడా ఈ కమిటీ సూచించనుంది.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ కమిటీలో నీతి అయోగ్ సీఈవోతోపాటు కేంద్ర హోం శాఖ సెక్రటరీ, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణ, విధి విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, నియమ నిబంధనలు వంటి వాటిని కమిటీ అధ్యయనం చేసి, నివేదిక అందజేస్తుంది. ఏ పరిధిలో గేమ్స ఆడాలి.. గేమ్స్‌కు ప్లేయర్లు అడిక్ట్ అవ్వకుండా, వాళ్లకు హాని కలిగించకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఎంత సేపు గేమ్స్ ఆడాలి.. వంటి అంశాల్లో స్పష్టమైన నిబంధనలను ఈ కమిటీ రూపొందిస్తుంది. ఈ విషయాల్లో ఎలాంటి చట్టాలు చేయాలో కూడా కమిటీ నిర్ణయిస్తుంది. ఆన్‌లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలని గతంలో మంత్రుల కమిటీ సూచించింది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆన్‌లైన్ ఫాంటసీ గేమ్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదాయం వస్తోంది. 2020లో దాదాపు 20.36 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా, 2025కల్లా ఈ ఆదాయం 38.60 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అమెరికాలో అనేక రాష్ట్రాలు గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నియంత్రిస్తున్నాయి.

PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..

మన దేశంలో ప్రస్తుతం ఫాంటసీ గేమ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ గేమ్స్ ఎక్కువగా మొబైల్ వాడే వాళ్లను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. అందువల్ల మొబైల్ వాడేవాళ్లలో ఎక్కువగా ఈ గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. దేశంలో మొబైల్ గేమ్స్ మార్కెట్ విలువ 2020లో 2.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ గేమ్స్ ఆడేవాళ్లలో ఆసియా ఖండం ముందుంది. ఆసియాలో13 కోట్ల మంది ఈ గేమ్స్ ఆడుతున్నట్లు అంచనా. మొత్తం 200 కంపెనీలు కలిపి రూ.34,000 కోట్ల మార్కెట్ కలిగి ఉన్నాయి.