Union Home Minister Amit Shah: ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో సమూల మార్పులు.. అమిత్ షా కీలక ప్రకటన

ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్‌లు అందించిన అమిత్ షా.. ఈ వ్యాన్‌లు కేసులను త్వరగా చేధించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.

Union Home Minister Amit Shah: ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో సమూల మార్పులు.. అమిత్ షా కీలక ప్రకటన

Union Home Minister Amit Shah.

Updated On : February 16, 2023 / 3:20 PM IST

Union Home Minister Amit Shah: ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లోని మూడు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గురువారం కింగ్స్ వే క్యాంప్‌లో జరిగిన ఢిల్లీ పోలీసుల 76వ రైజింగ్ డే వేడుకల్లో షా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఫోరెన్సిక్, ఎవిడెన్స్ చట్టాల్లో చాలా మార్పులు రానున్నాయని సంచలన ప్రకటన చేశారు. మాదకద్రవ్యాల వ్యాపారులపై కఠినమైన శిక్షలు విధించబడతాయని తెలిపారు.

Minister Amit Shah: అసోంలో అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?

ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్‌లు అందించిన అమిత్ షా, ఈ వ్యాన్‌లు కేసులను త్వరగా ఛేదించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు ఆరు సంవత్సరాలు కంటే ఎక్కువ శిక్ష విధించే కేసులలో చాలా ముఖ్యమైనవని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామన్న అమిత్ షా, ఈశాన్య భారతంలో ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని అన్నారు.

 

కరోనా సమయంలో ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని కేంద్ర హోం మంత్రి ప్రశంసించారు. G20 ఈవెంట్‌‍‌కి పలు దేశాల అధ్యక్షులు హాజరవుతున్నందున ఢిల్లీ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించారు.