Chimpanzee: చింపాంజీ వీడియో వైరల్.. ప్లాస్టిక్ భూమికి మంచిది కాదని కోతులకూ తెలుసా?

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

Chimpanzee: చింపాంజీ వీడియో వైరల్.. ప్లాస్టిక్ భూమికి మంచిది కాదని కోతులకూ తెలుసా?

Monkey

Chimpanzee: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తెలియకుండానే మనకు పెద్ద లెసన్స్ నేర్పుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో చింపాంజీని చూస్తే కచ్చితంగా మనుషులు ఆలోచనలు కొంతవరకు మారవచ్చునని చెబుతున్నారు.

వాస్తవానికి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, చింపాంజీ తన రెండు కాళ్లపై నడుస్తూ కనిపించింది. అలా నడవడం చింపాజీకి విశేషమేమీ కాదు, కానీ, ప్రత్యేకత ఏమిటంటే.. రెండు చేతుల్లోనూ పాదాల వేళ్లపై పండ్లను పెట్టుకుని అలాగే నోటిలో కూడా పండ్లను పెట్టుకుని నడుస్తూ కనిపించింది.

Allu Sirish : సోషల్ మీడియాకి దూరం అవుతున్న అల్లు శిరీష్

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, ‘మీరు ఒక బ్యాగ్ కోసం 10రూపాయలు చెల్లించకూడదనుకున్నప్పుడు’ ఇలా చేయవచ్చు అంటూ ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రత్యేక మెసేజ్‌ కూడా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రజలు ఈ వీడియోపై వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ప్లాస్టిక్ బ్యాగులు మన భూమికి మంచివి కావు అని, ఈ విషయం కోతికి కూడా తెలుసు’ అని ఓ యూజర్ రాశారు. అదే సమయంలో, మరొక ట్విట్టర్ యూజర్ ‘ఇది చాలా తెలివైనది. నా నెక్స్ట్ షాపింగ్ టైమ్‌లో నేను కూడా ఇలాగే చేస్తాను” అంటూ రాసుకొచ్చారు.

PUBG : గేమర్స్‌కు గుడ్ న్యూస్, పబ్ జీ గేమ్ వచ్చేసింది..కొత్తకొత్తగా!