Lucky plants : అదృష్టం మీ తలుపు తట్టాలా? ఇంట్లో ఈ లక్కీ ప్లాంట్స్ పెట్టండి
మొక్కలు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. మొక్కలుంటే చాలు పచ్చని పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం మీ సొంతం. అయితే కొన్ని మొక్కలు మీరు ఇంట్లో పెంచితే అదృష్టం కూడా కలిసి వస్తుందట.

Lucky plants
Lucky plants : మొక్కలు పెంచడం చాలామందికి హాబీ ఉంటుంది. సిటీల్లో తగినంత ప్లేస్ లేక మొక్కలు పెంచడం కష్టం. ఇప్పుడు చాలామటుకు టెర్రస్ గార్డెన్‌లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి వెలుపల సరే.. ఇంట్లో పెంచే లక్కీ ప్లాంట్స్ గురించి మీకు తెలుసా? అవి చాలా అదృష్టన్ని తీసుకొస్తాయట.
Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు
కొన్ని మొక్కలు ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉండటంతో పాటు కొన్ని దుష్ట శక్తులు దరిచేరవని చాలామంది నమ్ముతారు. ఆకుపచ్చని మొక్కలు కంటికి మంచిదని చెబుతారు. అలాగే వాస్తు ప్రకారం, ఆరోగ్యం విషయంలో కొన్ని మొక్కలు ఇంట్లో సూచించిన దిశలో ఉంచితే డబ్బు, అదృష్టం కలిసి వస్తాయట. ఆ మొక్కలే లక్కీ ప్లాంట్స్.
తులసి మొక్కను ఎంతో పవిత్రమైన, శభప్రదమైన మొక్కగా భావిస్తాం. పూజలు కూడా చేస్తాం. గొప్ప ఔషధ గుణాలు కూడా ఉన్న ఈ మొక్క వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల దోమలు కూడా చేరవు. తులసిని ఇంటి ముందు లేదా వెనుక, బాల్కనీ లేదా కిటికీలో ముఖ్యంగా సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెంచాలి. రెండవది జాడే మొక్క. చిన్న గుండ్రని ఆకుతో ఉండే ఈ మొక్క ఫెంగ్ షుయ్ ప్రకారం ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుందట. ఇంట్లో లేదా ఆఫీసులో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. జాడే మొక్క శాస్త్రీయ నామం క్రాసులా ఒవాటా. ఈ మొక్కను బాత్రూంలో మాత్రం ఉంచకూడదట.
వెదురు మొక్కను కూడా అదృష్ట మొక్కగా చెబుతారు. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం, ఆరోగ్యం ఉంటాయని చెబుతారు. ఇంట్లో ఈ మొక్కలు ఉండటం వల్ల గాలిని శుద్ధి చేస్తాయట. కాలుష్య కారకాలని తొలగిస్తాయట. వెదురు మొక్కను తూర్పు మూలలో పెట్టడం మంచిదని చెబుతారు.ఇక చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెడతారు. ఇది కూడా సంపదని అదృష్టాన్ని సూచిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆర్ధిక సమస్యలు అధిగమిస్తారట. గాలిని శుద్ధి చేసే మనీ ప్లాంట్ మొక్కలు గాలిలో ఉండే విషాన్ని కూడా ఫిల్టర్ చేస్తాయట. ఈ మొక్కలు పెంచడం చాలా సులభం. ఈ మొక్కలు పెట్టుకోవడం వల్ల వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విజయాలు సాధిస్తారట.
అరెకా పామ్ మొక్కలు ఫెంగ్ షుయ్ ప్రకారం ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును కలిగిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందట. ఈ మొక్కను ఇంట్లో ఏ దిశలో పెట్టినా మంచిదేనట. ఇక రబ్బర్ ప్లాంట్, మొక్కజొన్న మొక్క, లవెండర్, యూకలిప్టస్, స్నేక్ ప్లాంట్, గోల్డెన్ పాథోస్, పీపల్ బొన్సాయ్, జిన్సెంగ్ ఫికస్, సిట్రస్ చెట్లు, అడెనియం, పిచ్చర్ ప్లాంట్ వీటిని కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ కలిసి వస్తుందట. అన్ని మొక్కలు అందుబాటులో లేకపోయిన దొరికిన వాటిని ఇంట్లో పెట్టి అదృష్టం పరీక్షించుకోండి.
Mosquitoes : దోమలను నివారించే మొక్కలు! మీ పెరట్లో ఈ మొక్కలు ఉండేలా చూసుకోండి