Gujarat polls: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘మీసాల మనిషి’.. ప్రభుత్వం మీసాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి

ఆయన పేరు మగన్‌భాయి సోలంకీ.. వయసు 57 ఏళ్లు. ఆయనకు 2.5 అడుగుల మీసాలు ఉన్నాయి. ఆయనను ‘మీసాల మనిషి’ అని స్థానికులు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. యువత మీసాలు పెంచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని సోలంకీ కోరుతున్నారు.

Gujarat polls: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘మీసాల మనిషి’.. ప్రభుత్వం మీసాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి

Gujarat polls

Gujarat polls: ఆయన పేరు మగన్‌భాయి సోలంకీ.. వయసు 57 ఏళ్లు. ఆయనకు 2.5 అడుగుల మీసాలు ఉన్నాయి. ఆయనను ‘మీసాల మనిషి’ అని స్థానికులు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. యువత మీసాలు పెంచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని సోలంకీ కోరుతున్నారు.

ఆయన హిమ్మత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన ఆర్మీలో పనిచేశారు. 2012లో రిటైర్ అయ్యారు. తాజాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇష్టమని, అందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు.

తాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశానని, ఆ సమయంలో బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగానని అన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వెనకడుగు వేయలేదని, 2019 లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని చెప్పారు. ఇప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నానని వివరించారు. తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా తన మీసాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పారు.

FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్‌లో ప్రజల సంబరాలు

గతంలో తాను ఆర్మీలో పనిచేసే సమయంలోనూ తన మీసాలే తనకు సీనియర్ అధికారుల వద్ద మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ప్రజలు తన మీసాలు చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ఇక చిన్నారులు తన వద్దకు వచ్చి, తన మీసాలను తాకి వెళ్తున్నారని తెలిపారు. ఇంత పొడవుగా మీసాలు ఎలా పెంచావంటూ యువత అడుగుతోందని వ్యాఖ్యానించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..