Sonu Sood : అమ్మా..చాలా మిస్ అవుతున్నా

తల్లి జయంతి సందర్భంగా...సోనూ సూద్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 2007లో సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ కన్నుమూశారు. 2016లో సోనూ తండ్రిని కూడా కోల్పోయారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా..అని వెల్లడించారు.

Sonu Sood : అమ్మా..చాలా మిస్ అవుతున్నా

Sonusood

Updated On : July 21, 2021 / 8:19 PM IST

Happy Birthday Maa Sonu Sood : వెండితెరపై విలన వేషాలు వేసిన సోనూ సూద్ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన్ను దేవుడిలో పోల్చారు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలు నలుగురికి ఆదర్శంగా నిలిచాయి. కార్మికులు, రైతులు..ఇలా ప్రతొక్కరికీ సహాయం చేస్తూనే ఉన్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఏకంగా విమాన సౌకర్యం కూడా కల్పించారు. సహాయం చేయాలని ఇప్పటికీ ఆయనకు విజ్ఞప్తులు వస్తున్నాయి. తాజాగా..ఆయన చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Read More : Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. కొనుగోలుదారులకు నేరుగా హోం డెలివరీ!

తన తల్లి జయంతి సందర్భంగా…ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 2007లో సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ కన్నుమూశారు. 2016లో సోనూ తండ్రిని కూడా కోల్పోయారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా..అని వెల్లడించారు. వ్యక్తిగతంగా విష్ చేయాలని అనుకుంటున్నట్లు, తనకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ మెసేజ్ లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో..ఎప్పటికీ వ్యక్తపరచలేవన్నారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసే వరకు ఎప్పుడూ అలాగే ఉంటుందన్నారు. ఎక్కడ ఉన్నా..సంతోషంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయాలంటూ సోనూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Read More : Katrina Kaif : పెళ్లి ఫిక్స్.. హింట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ స్టాఫ్ మెంబర్..