Katrina Kaif : పెళ్లి ఫిక్స్.. హింట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ స్టాఫ్ మెంబర్..

త్వరలోనే కత్రినా కైఫ్, తన బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటోందని, ఇందుకు సంబంధించి సల్మాన్ ఖాన్ టీం మెంబర్ ఒకరు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారంటూ బాలీవుడ్‌ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది..

Katrina Kaif : పెళ్లి ఫిక్స్.. హింట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ స్టాఫ్ మెంబర్..

Katrina Kaif

Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి ప్రేమలో పడిందని ఎప్పటినుంచో హిందీ ఇండస్ట్రీలో న్యూస్ నడుస్తోంది. అయితే అంతకుముందున్న రిలేషన్స్‌లా కాకుండా ఇది పెళ్లి వరకూ వచ్చిందని, త్వరలోనే కత్రినా కైఫ్, తన బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటోందని, ఇందుకు సంబంధించి సల్మాన్ ఖాన్ టీం మెంబర్ ఒకరు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారంటూ బాలీవుడ్‌ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సల్మాన్ ఖాన్ పర్సనల్ స్టైలిష్ట్ ఆష్లే రెబెల్లో ఇటీవల కత్రినా పుట్టినరోజు సందర్భంగా ‘భారత్’ సినిమాలో ఆమె వెడ్డింగ్ గౌను వేసుకున్న పిక్ పోస్ట్ చేసి విషెస్ చెబుతూ.. ‘త్వరలో ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను’ అని కామెంట్ చేశాడు. దీనికి కత్రినా ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఇక పెళ్లి ఫిక్స్ అయినట్లేనంటున్నారు.

Katrina Kaif

 

కత్రినా కైఫ్ ఇండిపెండెంట్‌గా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి తెచ్చుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇంకా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే ఇక ఎన్నాళ్లని సింగిల్‌గా ఉంటాం.. పెళ్లి చేసుకుంటే ఓ పనైపోతుందని ఫీలయినట్టుంది.. అందుకే బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్‌ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

సల్మాన్, రణబీర్‌తో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ చాలా కాలం సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేసింది. లాస్ట్ ఇయర్ నుంచే విక్కీతో కాస్త క్లోజ్‌గా ఉంటోందని, వాళ్లిద్దరి మధ్య అంతకు మించిందేదో ఉందని బాలీవుడ్ మీడియా హడావిడి చేసింది. అంతేకాదు ..కత్రినా కైఫ్ ఇంటికి విక్కీ కౌశల్ రాకపోకలు కూడా ఉండడంతో ఇంకేముంది.. డౌట్ లేదు ఇద్దరూ లవ్‌లో ఉన్నారంటూ ఫిక్స్ అయిపోయారు అందరూ.

Vicky Kaushal – Katrina Kaif : కత్రినా ఇంట్లో విక్కీ.. లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందా..?

లేటెస్ట్‌గా 38 కంప్లీట్ చేసుకున్న కత్రినా.. 40 వచ్చేలోపే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. అంతే కాదు పెళ్లి కూతురు గెటప్‌లో కత్రినా ఉన్న ఫోటో నిజమైతే ఎంత బావుండు అని విష్ చేసిన కొంతమందికి.. ‘థాంక్యూ .. తప్పకుండా’.. అని కత్రినా రిప్లై ఇచ్చింది. అంతేకాదు.. మొన్నామధ్య బాలీవుడ్ మీడియాకి విక్కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కత్రినాతో రిలేషన్ గురించి ఏం చెబుతారని అంటే.. దీనిపై మీకు క్లారిటీ త్వరలోనే వస్తుందంటూ ఆన్సర్ ఇచ్చాడు. అందుకే ఇక ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారంటూ ఫ్యాన్స్‌తో పాటు, సోషల్ మీడియాలో సందడి మొదలైంది.