Vicky Kaushal – Katrina Kaif : కత్రినా ఇంట్లో విక్కీ.. లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందా..?

విక్కీ, కత్రినా మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తున్నా.. ఇద్దరిలో ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు..

Vicky Kaushal – Katrina Kaif : కత్రినా ఇంట్లో విక్కీ.. లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందా..?

Vicky Kaushal – Katrina Kaif

Vicky Kaushal – Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరో సారి ప్రేమలో పడిందని ఎప్పటినుంచో హిందీ ఇండస్ట్రీలో న్యూస్ నడుస్తోంది. అబ్బే.. కాదులే ఇదంతా ఒట్టి రూమరే అనుకునే లోపే.. ప్రూఫ్‌లతో సహా మీడియాలో మరోసారి కత్రినా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో హైలెట్ అవుతోంది.

లాక్‌డౌన్‌తో ఎవర్నీ కలుసుకోలేక ఇంట్లోనే ఉంటున్న స్టార్లు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. మిస్ అవుతున్న వాళ్లని కలుస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాని కలవడానికి తన రూమర్ బాయ్ ఫ్రెండ్ వచ్చారు. బాలీవుడ్‌లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న హాట్ కపుల్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్. ఈ రూమర్డ్ లవ్ బర్డ్స్ కరోనా నుంచి కోలుకుని బ్యాక్ టు నార్మల్ అయ్యారు.

‘URI’ తో హ్యాపెనింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్కీ కౌశల్.. కత్రినాకి మధ్య ఏదో నడుస్తోందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూనే ఉన్నారు. మొన్నీ మధ్య కూడా విక్కీ, కత్రినా ఇంటికి మధ్యాహ్నం వెళ్లి.. రాత్రి 9 గంటల వరకూ టైమ్ స్పెండ్ చేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. గతేడాది కోవిడ్ టైం లోనూ విక్కీ ఇలాగే కత్రినా కైఫ్ ఇంటికి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

విక్కీ, కత్రినా మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తున్నా.. ఇద్దరిలో ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే విక్కీని కత్రినాతో మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. అబ్బే అలాంటిదేం లేదు.. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, ఇంకా నేను సింగిలే అని చెప్పి కన్విన్స్ చేసేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ కపుల్ గురించి ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.