Gautham : హ్యాపీ బర్త్‌డే లిటిల్ ప్రిన్స్..

గౌతమ్ నేటితో 15వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కుమారుడిపై ప్రేమను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు మహేష్ బాబు..

Gautham : హ్యాపీ బర్త్‌డే లిటిల్ ప్రిన్స్..

Gautham

Updated On : August 31, 2021 / 10:46 AM IST

Gautham: సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్‌ల తనయుడు.. లిటిల్ ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు నేడు (ఆగస్టు 31). ఈ సంవత్సరంతో గౌతమ్ 15వ ఏట అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా కుమారుడిపై ప్రేమను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు మహేష్ బాబు.

Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..

‘హ్యాపీ 15 మై సన్.. నీ ఎదుగుదలను చూస్తుండడం నాకెప్పుడూ గొప్ప ఆనందం.. ఎల్లప్పుడూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లి ప్రపంచాన్ని జయించు.. లవ్ యూ’.. అంటూ తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు మహేష్.

గౌతమ్, తండ్రి హీరోగా నటించిన ‘1 – నేనొక్కడినే’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం స్టడీస్‌తో పాటు తనకిష్టమైన స్పోర్ట్స్‌లోనూ రాణిస్తున్న గౌతమ్ త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తాడని సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Gautam : తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని..!