Harish Shnkar: పవన్-త్రివిక్రమ్‌ల బంధం.. అలకబూనిన హరీష్?

నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం ఆనంద్ మహీంద్రానే హెల్ప్ అడుగుతూ ట్వీట్ చేసి అంచనాలు పెంచేస్తే.. మరో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఓ ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. కాలమే సమస్య..

Harish Shnkar: పవన్-త్రివిక్రమ్‌ల బంధం.. అలకబూనిన హరీష్?

Harish Shnkar

Updated On : March 5, 2022 / 5:49 PM IST

Harish Shnkar: నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం ఆనంద్ మహీంద్రానే హెల్ప్ అడుగుతూ ట్వీట్ చేసి అంచనాలు పెంచేస్తే.. మరో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఓ ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. కాలమే సమస్య.. కాలమే సమాధానం అంటూ అందరికీ అర్ధంకాని పజిల్ క్రియేట్ చేశాడు. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించా హరీష్ అలకా అని అనుకునేలోపు వాళ్ల ఫోటోనే పోస్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు.

Harish Shankar: బాలీవుడ్ కి మరో తెలుగు దర్శకుడు.. డీజే సినిమా రీమేక్?

కాలాన్ని బాగా నమ్ముతున్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. మొన్నామధ్య పవన్ తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. దీన్ని గుర్తుపెట్టుకోండి.. టైమ్ వచ్చినప్పుడు ఆ ఎక్జైటింగ్ కన్వర్జేషన్ ను మీకు చెప్తా అన్నాడు హరీష్. ఇప్పుడేమో కొన్నిసార్లు కాలమే సమస్య.. కొన్నిసార్లు కాలమే సమాధానం అని పోస్ట్ చేశాడు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ లేట్ కారణంగానే హరీశ్ శంకర్ ఫ్రస్టేషన్ చూపిస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది.

Pawan Kalyan : ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. పవన్‌ని కలిసిన హరీష్ శంకర్..

పవన్ ఈమధ్య ఇన్స్ స్టంట్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే భీమ్లానాయక్ తర్వాత వినోదయ సిత్తం రీమేక్ తెరపైకొస్తుందనే టాక్ నడుస్తోంది. ఈ రీమేక్ ను కూడా త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అంతా సెట్ అయితే వినోదయ సిత్తంతో పాటూ క్రిష్ హరిహర వీరమల్లుని పూర్తి చేయాలి పవన్.

Trivikram : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదు?

పవర్ స్టార్ లైనప్ బాగుంది కానీ భవదీయుడుకు మోక్షం ఎప్పుడన్నది ప్రశ్నగా మారింది. దీంతో పవన్ ను గైడ్ చేస్తోన్న త్రివిక్రమ్ పై అలిగిన హరీశ్.. కాలం సమాధానం చెప్తుందనే ట్వీట్ చేసారనే టాక్ సోషల్ మీడియాలో వైరలయింది. దీంతో అలర్టయిన హరీశ్ శంకర్ అలాంటిదేమి లేదనట్టు.. పవన్, త్రివిక్రమ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి చిల్ అయ్యాడు.