Harish Shankar: బాలీవుడ్ కి మరో తెలుగు దర్శకుడు.. డీజే సినిమా రీమేక్?

ఉత్తరాదిన ఎక్కడ చూసినా తెలుగు సినిమాలాగే హవా. బాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ మేకర్స్ దెబ్బకి చేతులెత్తేసి హ్యాండ్సప్ చెప్పాల్సిన పరిస్థితి.

Harish Shankar: బాలీవుడ్ కి మరో తెలుగు దర్శకుడు.. డీజే సినిమా రీమేక్?

Harish Shankar

Updated On : January 30, 2022 / 9:07 PM IST

Harish Shankar: ఉత్తరాదిన ఎక్కడ చూసినా తెలుగు సినిమాలాగే హవా. బాలీవుడ్ మేకర్స్ సైతం టాలీవుడ్ మేకర్స్ దెబ్బకి చేతులెత్తేసి హ్యాండ్సప్ చెప్పాల్సిన పరిస్థితి. నార్త్ ప్రేక్షకులు మన సినిమాలకు బ్రహ్మరధం పట్టడంతో మన మేకర్స్ కూడా బాలీవుడ్ మీద స్పెషల్ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్ తో పాటు యంగ్ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి కూడా రీమేక్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు.

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గేమ్ ప్లాన్.. ఓటీటీ కోసం మాజీ కంటెస్టెంట్లు?

ఇప్పుడు మరో దర్శకుడు కూడా బాలీవుడ్ లో లక్ పరీక్షించుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ కు రెండేళ్లగా తెలుగులో సినిమా పడలేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరీష్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం పవన్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో భగత్ సింగ్ మొదలు పెట్టేందుకు సమయం పట్టేలా ఉంది.

All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

ఈలోగా హరీష్ శంకర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఏటీఎం అనే వెబ్ సిరీర్ ప్లాన్ చేశాడు. ఇదిలా ఉండగానే దిల్ రాజు హరీష్ శంకర్ తో ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేసే సన్నాహాలు కూడా మొదలు పెట్టారట. అల్లు అర్జున్ హీరోగా డీజే సినిమాను తెరకెక్కించాడు హరీష్ శంకర్. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా డీజీ మంచి మార్కులే వేసింది. ఇప్పుడు ఈ సినిమాను మార్పులు చేర్పులతో బాలీవుడ్ రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే కథా మార్పులు కూడా పూర్తికాగా.. త్వరలోనే ఈ సినిమా ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.