Trivikram : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదు?

పవన్ సినిమా అంటే త్రివిక్రమ్ అక్కడ ఉండాల్సిందే. ఈవెంట్ లో కూడా డైరెక్టర్, పవన్ మాట్లాడుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని ముందుండి నడిపించారు అని చెప్పారు. ఈ సినిమాకి మాటలు త్రివిక్రమ్.....

Trivikram : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదు?

Trivikram

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ సారి ఈవెంట్ లో స్పీచ్ లు చాలా తక్కువ మంది మాట్లాడారు.

అయితే పవన్ సినిమా అంటే త్రివిక్రమ్ అక్కడ ఉండాల్సిందే. ఈవెంట్ లో కూడా డైరెక్టర్, పవన్ మాట్లాడుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని ముందుండి నడిపించారు అని చెప్పారు. ఈ సినిమాకి మాటలు త్రివిక్రమ్ రాశారు. డైరెక్షన్ సాగర్ కే చంద్ర చేసినా అన్నిట్లో త్రివిక్రమ్ హస్తం ఉందని క్లారిటీగా అందరికి తెలిసిపోయింది. ఎప్పుడూ పవన్ తో కలిసి వచ్చే త్రివిక్రమ్ నిన్న ఈవెంట్ కి లేట్ గా వచ్చి కొన్ని నిముషాలు ఉండి వెళ్లిపోయారు. స్పీచ్ కూడా మాట్లాడలేదు. త్రివిక్రమ్ స్పీచ్ లకి చాలా మంది అభిమానులు ఉన్నారు. త్రివిక్రమ్ మాట్లాడకపోవడం, కొద్ది సేపే ఉండి వెళ్లిపోవడంతో త్రివిక్రమ్ అభిమానులు నిరాశ చెందారు.

అయితే సినిమా అంతా ముందుండి నడిపించిన త్రివిక్రమ్ చివర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంబంధం లేకుండా ఉన్నట్లు ఉండటం, స్పీచ్ ఇవ్వకపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. అందులో ముఖ్యంగా బండ్ల గణేష్ అంశం. పవన్ సినిమా ఫంక్షన్ అంటే పవన్ స్పీచ్ తో పాటు అందరూ వేచి చూసేది త్రివిక్రమ్, బండ్ల గణేష్ స్పీచ్ ల కోసం. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ చెప్పే స్పీచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఈ సారి ఈవెంట్ కి బండ్ల గణేష్ రాకపోవడం గమనార్హం.

Pawan kalyan : బిల్ గేట్స్‌తో మీటింగ్ ఉన్నా కూడా వచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు

ఈవెంట్ కి కొద్ది రోజుల ముందు బండ్ల గణేష్ ఆడియో కాల్ ఒకటి వైరల్ అయింది. ఇందులో త్రివిక్రమ్ తనని ఈవెంట్ కి రానివ్వకుండా చేస్తున్నాడని, నాకు పిలుపు రాలేదని మాట్లాడాడు బండ్ల గణేష్. ఈ ఆడియో కాల్ బాగా వైరల్ అయింది. బండ్ల ఇది తన వాయిస్ కాదని సన్నిహితుల వద్ద చెప్పినా అధికారికంగా చెప్పకపోవడంతో అభిమానులంతా ఇది నిజం అనుకోని త్రివిక్రమ్ ని ట్రోల్ చేశారు. ఈ విషయంపై త్రివిక్రమ్‌ అప్‌సెట్‌ అయ్యారని, అందుకే మాట్లాడలేదని తెలుస్తుంది. ఒకవేళ మాట్లాడినా త్రివిక్రమ్ మాట్లాడేటప్పుడు అభిమానులు బండ్ల గణేష్ కోసం అరుస్తారు. అది జరగకూడదనే త్రివిక్రమ్ మాట్లాడలేదని తెలుస్తుంది.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

మరో వైపు ‘భీమ్లా నాయక్’ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్‌ పేరే హైలైట్‌ అవుతూ వస్తుంది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర అయినా మొత్తం త్రివిక్రమ్ చేశారని వార్తలు వచ్చాయి. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ పేరు కానీ ఫోటోలు కానీ ఎక్కడా ప్రమోట్ చేయలేదు. అన్ని చోట్ల త్రివిక్రమ్ తోనే ప్రమోట్ చేశారు. చాలా మందికి ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ ఏమో అనే సందేహం కూడా వచ్చింది. ఈ విషయంపై కూడా త్రివిక్రమ్ ని ట్రోల్ చేశారు. దీంతో ఈవెంట్ లో మాట్లాడి తాను హైలెట్ అయితే మళ్ళీ ట్రోల్ చేస్తారని త్రివిక్రమ్ భావించి మాట్లాడలేదని తెలుస్తుంది.

Samyuktha Menon : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ సందడి

అందుకే త్రివిక్రమ్ నిన్న లేట్ గా వచ్చి కొన్ని క్షణాలు ఉండి వెళ్లిపోయారని అంతా అనుకుంటున్నారు. కానీ త్రివిక్రమ్ మాట్లాడకపోవడంతో మంచి స్పీచ్ మిస్ అయ్యారని ఆయన అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్, బండ్ల గణేష్ లేని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చప్పగా సాగిందని అంతా భావిస్తున్నారు. వారిద్దరి స్పీచ్ లు ఉంటే ఈవెంట్ మరింత హైలెట్ అయ్యేదని అనిపించింది అందరికి.