Mohammed Shami Wife: నా భర్తను అరెస్టు చేయండి.. వివాహేతర సంబంధాలున్నాయి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్ 

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన జహాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అతని అరెస్టు వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేసి వెంటనే షమీని అరెస్టు చేయాలని హసీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Mohammed Shami Wife: నా భర్తను అరెస్టు చేయండి.. వివాహేతర సంబంధాలున్నాయి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్ 

Mohammed Shami And Hasin Jahan (File Photo)

Mohammed Shami Wife: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని అరెస్టు చేయాలని, అతని అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ అతని భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు, షమీపై తీవ్రస్థాయిలో అక్రమ సంబంధాల విషయంపై ఆరోపణలు చేసింది. అతనికి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పింది.  అతడు నన్ను నిత్యం కట్నం కోసం వేదించాడని, ఎంతో మంది మహిళలతో షమీకి వివాహేతర సంబంధాలున్నాయని హసీన్ జహాన్ ఆరోపించింది. ఇప్పటికీ జాతీయ క్రికెట్ జట్టుతో కలిసి బీసీసీఐ టూర్లకు వెళ్లినప్పుడు కూడా అతను ఆ సంబంధాలను కొనసాగిస్తున్నాడు అంటూ హసీన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.

Mohammed Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు.. ప్రతీనెల 1.30లక్షలు చెల్లించాల్సిందే ..

మహ్మద్ షమీ, హసీన్ జహాన్ కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. షమీ తనను వేదిస్తున్నాడని, తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన విషయం విధితమే. 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు షమీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ అరెస్టు వారెంట్‌ను సవాల్ చేస్తూ షమీ సెషన్స్ కోర్టుకు వెళ్లగా అదే ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు వారెంట్‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.  షమీ అరెస్టు వారెంట్ ఎత్తివేయాలని కోరుతూ హసీన్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు అందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాజాగా హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

మహ్మద్ షమీ, హసీన్ జహార్లకు కూతురు ఉంది. హసీన్‌కు నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా హైకోర్టు గతంలో ఆదేశించింది. ఇందులో హసీన్ ఖర్చుల నిమిత్తం రూ. 50వేలు, కుమార్తె పోషణకు రూ. 80వేలుగా నిర్ణయిస్తూ కోల్‌కతా హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం విధితమే. ప్రస్తుతం మహ్మద్ షమీ ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ జట్టు తరపున ఆడుతున్నాడు. అద్భుత ఫామ్‌ను షమీ కొనసాగిస్తున్నారు.