Kohli: జావెద్‌ మియాందాద్‌తో కోహ్లీని పోల్చిన పాక్ మాజీ కెప్టెన్

మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా స‌రిగ్గా ఆడ‌ట్లేదు. దీంతో ఆయ‌న ఆట‌తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు మాత్రం కోహ్లీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. కోహ్లీ ఆట‌తీరుపై పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ స్పందించారు. పాక్ మాజీ క్రికెట‌ర్ జావెద్‌ మియాందాద్‌తో కోహ్లీని పోల్చారు.

Kohli: జావెద్‌ మియాందాద్‌తో కోహ్లీని పోల్చిన పాక్ మాజీ కెప్టెన్

Kohli1

Kohli: మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా స‌రిగ్గా ఆడ‌ట్లేదు. దీంతో ఆయ‌న ఆట‌తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు మాత్రం కోహ్లీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. కోహ్లీ ఆట‌తీరుపై పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ స్పందించారు. పాక్ మాజీ క్రికెట‌ర్ జావెద్‌ మియాందాద్‌తో కోహ్లీని పోల్చారు.

”క్రికెట‌ర్ల‌కు సంబంధించిన డేటా, వీడియో విశ్లేష‌కుల వ‌ల్ల ఇప్పుడు అన్ని వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలిసిపోతున్నాయి. విరాట్ కోహ్లీ క్రికెట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన స‌మ‌యం నుంచే అటువంటివి ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, ఈ డేటాను చాలా మంది ప‌ట్టించుకోరు. కంప్యూట‌ర్లు క్రికెట్‌కు ఉప‌యోగ‌ప‌డ‌వ‌ని గొప్ప క్రికెట‌ర్ జావెద్ మియాందాద్ అన్నారు. ఈ విష‌యంలో కోహ్లీ కూడా జావెద్ మియాందార్‌లాంటి వాడేన‌ని నేను భావిస్తున్నాను. మ‌నం బాగా బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో బౌల‌ర్లు మ‌న బ‌ల‌హీన‌త‌ను గుర్తించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ విష‌యాన్ని మ‌నం గ్ర‌హించం.

 

ప్ర‌స్తుత కాలంలో క్రికెట్‌కు సంబంధించిన అంశాల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. ప్ర‌తి ఒక్క‌రూ బ్యాట్స్‌మ‌న్ బ‌ల‌హీన‌త‌ను గుర్తిస్తున్నారు. బాబ‌ర్, రిజ్వాన్, విరాట్ కోహ్లీ.. ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బ‌ల‌హీన‌త ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వారు త‌మ ఆట‌తీరును మార్చుకోలేదు” అని ర‌షీద్ ల‌తీఫ్ చెప్పారు. కాగా, ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కూడా విరాట్‌ కోహ్లీ రాణించ‌లేక‌పోవ‌డంతో అత‌డిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజాం కూడా కోహ్లీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఒడిదుడుకులు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు