Heat Movie Review : ఒక్క రాత్రిలో జరిగే కథతో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా మెప్పించిన హీట్..

 మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్(Suspense) థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్(Audience) వాటి కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి చెందిన 'హీట్‌' అనే సినిమా నేడు థియేటర్స్(Theaters) లో రిలీజయింది.

Heat Movie Review : ఒక్క రాత్రిలో జరిగే కథతో.. సస్పెన్స్ థ్రిల్లర్ గా మెప్పించిన హీట్..

Heat Movie Review suspense thriller heat movie in theaters

Heat Movie Review :  మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్(Suspense) థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్(Audience) వాటి కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోవలోకి చెందిన ‘హీట్‌’ అనే సినిమా నేడు థియేటర్స్(Theaters) లో రిలీజయింది. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా, మోహన్ సాయి, అంబికా వాణి, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మించగా ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు.

ఇక కథ విషయానికి వస్తే హీరోకి తన చిన్నప్పటి నుంచి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అతని కోసం ఓ అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి వచ్చేస్తుంది. హీరో దగ్గరుండి తన ఫ్రెండ్ కి, ఆ అమ్మాయికి పెళ్ళి చేస్తాడు. ఆ రోజు నైట్ పార్టీ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ తన ఫ్రెండ్, ఫ్రెండ్ వైఫ్ కనిపించకుండా పోతారు. అదే సమయంలో కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. దీంతో వాళ్ళు ఏమయ్యారు, ఆ హత్యలకు హీరోకు సంబంధం ఏంటి, హీరో తన స్నేహితులని కాపాడుకున్నాడా? మధ్యలో పోలీసులు హీరో కోసం వెతకడం.. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించారు.

Kushi : ఎట్టకేలకు ఖుషీ నుంచి అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగా సాగినా హీరో ఫ్రెండ్స్ కనపడకుండా పోయిన దగ్గర్నుంచి సినిమా చాలా ఇంట్రెస్ట్ గా మారుతుంది. ఒక్క రాత్రిలో ఈ కథ జరిగినట్టు చూపించారు. తెరపై హీరో టెన్షన్ పడుతుంటే ఆ సీన్స్ కి మనం కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేట్టు టెన్షన్ పడతాం. సెకండ్ హాఫ్ మరింత రసవత్తరంగా నడిపించారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో హీట్ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అంతా ఆశ్చర్యపోతారు. కెమెరా విజువల్స్, సంగీతం కూడా కొత్తగా ట్రై చేసి సస్పెన్స్ అంశాలకు మరింత బలం చేకూర్చారు.

హీట్ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా, రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది.