Maa Elections 2021: చేతిని కొరికిన హేమ.. మనిషి కాటు ప్రమాదమే.. హాస్పిటల్‌కు శివబాలాజీ!

మా ఎన్నికల్లో సినిమా నటులు రోడ్డున పడిపోయిన బాహాబాహీ కొట్టేసుకున్నారు.

Maa Elections 2021: చేతిని కొరికిన హేమ.. మనిషి కాటు ప్రమాదమే.. హాస్పిటల్‌కు శివబాలాజీ!

Shiva Balaji

Updated On : October 10, 2021 / 6:35 PM IST

Maa Elections 2021: మా ఎన్నికల్లో సినిమా నటులు రోడ్డున పడిపోయిన బాహాబాహీ కొట్టేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లో నటనతో మంచి పేరు దక్కించుకున్న హేమ, శివబాలాజీ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా.. హేమ ఏకంగా శివబాలాజీని గట్టిగా కొరికేసింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీలో ఉన్న హేమ, మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న శివబాలాజీ చేతిని కొరకడం వివాదం అయ్యింది.

ఈ క్రమంలోనే నిమ్స్‌లో టీటీ ఇంజిక్షన్ వేయించుకున్నారు శివబాలాజీ. చికిత్స కోసం నిమ్స్‌కు వెళ్లిన శివబాలాజీ డాక్టర్ల సూచిన మేరకు టీటీ ఇంజక్షన్ చేయించుకున్నారు. ఉదయం హేమ కొరకడంతో శివబాలాజీకి చిన్నపాటి గాయం అయ్యింది.

ఉదయం హేమ శివబాలాజీని కొరకడంతో ఒక్కసారిగా అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. మా ఎన్నికల్లో ఎందుకు శివబాలాజీ చేతిని కొరకాల్సి వచ్చిందో హేమ వివరణ ఇచ్చుకుంది కూడా. కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేశారని, యువకుడిని కాపాడేందుకు వెళ్తున్న తనను శివబాలాజీ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. శివబాలాజీ చేతిని కొరకాల్సి వచ్చిందని చెప్పింది.

ఇదే విషయమై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు. మనిషి కాటు చాలా ప్రమాదకరమని, అందులోనూ మధ్యాహ్నం కొరికింది కాబట్టి, ఎండవేడికి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే హాస్పిటల్‌కు శివబాలాజీ వెళ్లి ఇంజిక్షన్ వేయించుకుని ఉండొచ్చని అన్నారు.