Henna : ఆషాఢంలో ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకు!

ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాడంలో అందంతో పాటు.ఆరోగ్యాన్నిచ్చే గోరింటను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Henna : ఆషాఢంలో ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకు!

Henna

Henna : గోరింటాకు కేవలం అందం కోసమేనని చాలా మంది భావిస్తుంటారు. అయితే గోరింటాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. అంటు రోగాలు, వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. గోరింటలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బయటి గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు, ఒంట్లో వేడినీ తగ్గించడానికి సహాయపడుతుంది. గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు. లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాడంలో అందంతో పాటు.ఆరోగ్యాన్నిచ్చే గోరింటను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవచ్చు. కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్లలో పుండ్లలా తయారవుతుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది. స్త్రీ అర‌చేతి మ‌ధ్య‌లో గ‌ర్భాశ‌యానికి ర‌క్తం చేర‌వేసే ప్ర‌ధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాలు తొల‌గుతాయి.

శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను గోరింటాకు తగ్గిస్తుంది. గోరింట పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసుబారకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. నెలకోసారి గోరింటాకుతో తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా, నల్లగా మారతాయి. గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగుళ్లను నివారిస్తుంది. ఆవనూనెలో గోరింటాకు వేసి వేడిచేయాలి. తర్వాత వడకట్టగా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల మెహిందీ డిజైన్లు మార్కెట్‌లోకి అందుబాటులో ఉన్నాయి. గోరింటాకు వ‌ల్ల గోర్ల‌కు అందం రావ‌డమే కాకుండా, గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక పలు శాస్త్రీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.