Immunity Boosting Food: ఇమ్యూనిటీతో పాటు అందాన్ని పెంచే ఐదు ఆహారపదార్ధాలివే!

అసలే మనముంది కరోనా కాలం. ఆహారం విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు వహించడం ఎంతటి అవసరమో ఒకవేళ మహమ్మారి మనల్ని ఆవహించినా దానిని ఎదుర్కొనేందుకు మన దేహాన్ని సిద్ధం చేసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు.

10TV Telugu News

Immunity Boosting Food: అసలే మనముంది కరోనా కాలం. ఆహారం విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు వహించడం ఎంతటి అవసరమో ఒకవేళ మహమ్మారి మనల్ని ఆవహించినా దానిని ఎదుర్కొనేందుకు మన దేహాన్ని సిద్ధం చేసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. అందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుంటే కరోనాను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని వైద్య నిపుణులు హామీ ఇస్తున్నారు. మంచి ఆహరం తీసుకుంటే మన వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదు మీరు అందంగా కనిపిస్తారని చెప్తున్నారు. అలా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ మన చర్మం, జుట్టుకు ఉపయోగకరమైన ఆహరం గురించి ఇక్కడ మనం చూద్దాం..

1. Lemons

Immunity Boosting Food

Immunity Boosting Food

ప్రతిరోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గి.. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారు. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. నిమ్మలోని సి విటమిన్ చర్మ కాంతిని మెరుగుపరిచి చెడు పదార్ధాలను బయటకి పంపిస్తుంది.

2. Spinach

Immunity Boosting Food

Immunity Boosting Food

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది. బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది.

3. Almonds

Immunity Boosting Food

Immunity Boosting Food

బాదంలలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి, ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి. నానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. నానబెట్టిన బాదంపప్పు సహజంగా యాంటీ ఏజింగ్ ఆహారంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ పొద్దున నానబెట్టిన బాదంపప్పులు తింటే మీ చర్మాన్ని గట్టిగా, ముడతలు లేకుండా చేస్తుంది.

4. Pumpkin seeds

Immunity Boosting Food

Immunity Boosting Food

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలుంటాయి. అందుకే పంప్కిన్ (Pumpkin) సీడ్స్ రోజూ తింటే మంచిదే. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మన ఎముకల తయారీకి చాలా అవసరం. ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే, అంతలా ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. కెరాటెనాయిడ్స్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఈ గింజలు మన బాడీలో వేడిని తగ్గిస్తాయి. రోజూ ఈ గింజలు తింటే జలుబు, జ్వరం వంటివి కూడా రావు. ఈ గింజల్లో కుకుర్బిటిన్ జుట్టును పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది.

5. Papaya

Immunity Boosting Food

Immunity Boosting Food

బొప్పాయిలోని వివిధ రకాల ఖనిజాలు విటమిన్లు ఉంటాయి. ఏ,బి,సి,కె విటమిన్లు ఇందులో లభిస్తాయి. బొప్పాయి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనోయిడ్స్, పీచు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా సహాయం చేస్తుంది. బొప్పాయిలో పొటాషియం, క్యాల్షియం, సోడియం ఖనిజాలు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల్ని అదుపు చేస్తాయి. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, ల్యూటిన్ కంట్లో తేమను పెంచి మ్యాక్యులర్ డిజనరేషన్ అదుపు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లో విటమిన్ సీ లాంటి విటమిన్లు బాగా అలసిపోయినప్పుడు శరీరానికి శక్తినిచ్చి రిఫ్రెష్ అయ్యేటట్లు చేస్తాయి. బొప్పాయి వలన శరీరం, చర్మం పాలిపోయినట్లుగా మారకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

సో.. ఇప్పుడు మనం చూశాం కదా.. కాస్త ఈ ఆహార పదార్ధాల మీద మనసుపెడితే మన ఆరోగ్యం, అందం మన చేతుల్లో ఉన్నట్లే. ఇంకెందుకు ఆలస్యం రోజువారీ మీ ఆహారపు అలవాట్లలో పైన చెప్పిన ఆహారాన్ని కూడా జత చేసుకొని ఆరోగ్యంగా జీవించండి.