Opposition Meet: పాట్నాలో నేడే విపక్షాల మెగా సమావేశం.. హాజరయ్యే పార్టీలు, డుమ్మా కొట్టే పార్టీల లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‭లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గురువారం స్పష్టం చేశారు.

Opposition Meet: పాట్నాలో నేడే విపక్షాల మెగా సమావేశం.. హాజరయ్యే పార్టీలు, డుమ్మా కొట్టే పార్టీల లిస్ట్ ఇదే

List of Opposition Meet: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించే లక్ష్యంగా బిహార్ రాజధాని పాట్నా కేంద్రంగా నిర్వహించనున్న విపక్షాల మెగా సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని బీజేపీయేతర పక్షాలు హాజరు అవుతున్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఇందులో కొన్ని విపక్షాలకు అసలు ఆహ్వానమే అందలేదు. ఇంతకీ ఈ సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో, ఎవరు హాజరు కావడం లేదో ఒకసారి చూద్దామా..

CM KCR : సమైక్యవాదులు నాపై లెక్కలేనన్ని దాడులు చేశారు, నన్ను భయపెట్టారు- సీఎం కేసీఆర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా మరికొంత నేతలు బుధవారమే పాట్నా చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు శుక్రవారం రానున్నారు. అలాగే సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం హాజరుకానున్నారట.

Raj Patel Wine on Menu: మోదీ డిన్నర్ మెనూలో గుజరాతీ రాజ్‌పటేల్ రెడ్ వైన్

ఇక ఈ సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి హాజరు కావడం లేదు. వాస్తవానికి ఈ సమావేశానికి సంబంధించి ఆమెకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గురువారం స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంపై ఆమె గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాయావతి.. దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, వెనుకబాటుతనం, కుల విధ్వేషం వంటి వాటితో బహుజనులు (ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు) పడుతున్న ఇబ్బందులకు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయాల్సిన ఆవశ్యక్త ఉందని, అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఆ సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.

James Cameron : టైటాన్ కథ విషాదాంతం.. కానీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అక్కడికి 33 సార్లు వెళ్ళొచ్చాడు..

ఇక.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‭లను పిలవలేదట. ఈ సమావేశానికి రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరిని ఆహ్వానించినప్పటికీ.. ఆయనకు కుటుంబ కార్యక్రమం ఉండడం వల్ల హాజరు కావడం లేదని ఆ పార్టీ నాయకుడు ఒకరు స్పష్టం చేశారు.