Suhas: సినిమాలని టెలిగ్రామ్ పైరసీలో చూస్తున్నారు.. టెలిగ్రామ్ వల్లే గ్రామాల్లో కూడా ఫేమస్ అయ్యా..

సుహాస్ మాట్లాడుతూ.. షూటింగ్ కి అమలాపురం సైడ్ కొన్ని గ్రామాల్లోకి వెళ్ళాం. అక్కడ థియేటర్స్ ఉండవు. వాళ్ళు సినిమా చూడాలంటే ఒక 40 కిలోమీటర్లు అయినా రావాల్సిందే. దీంతో నేను అక్కడ ఎవ్వరికి తెలియదు కదా........

Suhas: సినిమాలని టెలిగ్రామ్ పైరసీలో చూస్తున్నారు.. టెలిగ్రామ్ వల్లే గ్రామాల్లో కూడా ఫేమస్ అయ్యా..

hero Suhas comments on Telegram Piracy Movies

Suhas:  షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు తెచ్చుకుంటూ ఎదిగాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి అందర్నీ మెప్పించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయి నేషనల్ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా సుహాస్ స్టార్ అయిపోయాడు. ఫ్యామిలీ డ్రామా సినిమాలో నెగిటివ్ సైకో క్యారెక్టర్ చేయడంతో విలన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయి. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం సుహాస్ చాలా బిజీ అయిపోయాడు.

త్వరలో సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజయి ప్రేక్షకులని మెప్పించింది. ఫిబ్రవరి 3న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో సుహాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల పైరసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Siddharth – Aditi : శర్వా నిశ్చితార్థంలో వీరిని గమనించారా? మరోసారి వైరల్ అవుతున్న ఈ జంట..

సుహాస్ మాట్లాడుతూ.. షూటింగ్ కి అమలాపురం సైడ్ కొన్ని గ్రామాల్లోకి వెళ్ళాం. అక్కడ థియేటర్స్ ఉండవు. వాళ్ళు సినిమా చూడాలంటే ఒక 40 కిలోమీటర్లు అయినా రావాల్సిందే. దీంతో నేను అక్కడ ఎవ్వరికి తెలియదు కదా అని ధైర్యంగా ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళగానే కలర్ ఫోటో హీరో అని అందరూ అరిచేస్తున్నారు. నేను షాక్ అయ్యా. నా సినిమా థియేటర్ లో కూడా రిలీజ్ కాలేదు. ఆహా అక్కడ వాడుతున్నారా అని అడిగాను. కాదు టెలిగ్రామ్ లో చూశాము అని చెప్పగానే షాక్ అయ్యాను. నన్ను చాలా మంది గుర్తుపట్టారు. ఎవర్ని అడిగినా కలర్ ఫొటో సినిమా టెలిగ్రామ్ లో చూశామని చెప్తున్నారు. ఇప్పుడు నెట్ ఉండటంతో కొత్త సినిమాలన్నీ పైరసీలో టెలిగ్రామ్ లో వస్తున్నాయి. థియేటర్స్, ఓటీటీ అవకాశాలు లేనివాళ్లు టెలిగ్రామ్ తో పైరసీలో సినిమాలు చూస్తున్నారు అని అన్నారు.