Iddaru : మాజీ ముఖ్యమంత్రి భార్య హీరోయిన్‌గా.. అర్జున్, జేడీ ‘ఇద్దరు’.. జులై 7 రిలీజ్..

యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ఇద్దరు".

Iddaru : మాజీ ముఖ్యమంత్రి భార్య హీరోయిన్‌గా.. అర్జున్, జేడీ ‘ఇద్దరు’.. జులై 7 రిలీజ్..

Heroine Sony Charista about Action King Arjun, JD Chakravarthy Movie Iddaru Releasing on July 7th

Iddaru Movie :  యాక్షన్ కింగ్ అర్జున్, రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య), సోని చరిష్టా హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఇద్దరు”. ఎఫ్.ఎస్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో, ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న (జులై 7) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ సోని చరిష్టా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడింది.

Samantha : సమంతకు మయోసైటిస్ ఇంకా తగ్గలేదా? చికిత్స కోసం అమెరికాకు.. అందుకే సినిమాలకు బ్రేక్?

ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ…. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. “ఇద్దరు” అనే ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయి. చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటన్నాను. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంది అని తెలిపింది.