Hindu Sisters: తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఈద్‌గాహ్‌కు స్థలాన్ని విరాళమిచ్చిన కూతుళ్లు

తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఇద్దరు హిందూ కూతుళ్లు రూ.1.5కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మృతి చెందిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Hindu Sisters: తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఈద్‌గాహ్‌కు స్థలాన్ని విరాళమిచ్చిన కూతుళ్లు

Hindu Sisters

 

Hindu Sisters: తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఇద్దరు హిందూ కూతుళ్లు రూ.1.5కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మృతి చెందిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు రంజాన్ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్తరాఖాండ్ లోని ఉద్ధమ్ సింగ్ నగర్ లోని కాశీపూర్ గ్రామంలో స్థలాన్ని విరాళమిచ్చి మహిళలు ప్రశంసలు అందుకుంటున్నారు.

దేశంలో మతపరమైన వివాదాలు రేకెత్తుతున్న సమయంలో ఈ ఘటన ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది.

బ్రజనందన్ ప్రసాద్ రస్తోగి అనే వ్యక్తి 20ఏళ్ల క్రితం మరణించారు. చనిపోయేముందు తన చివరి కోరిక మేరకు 63సెంట్ల స్థలాన్ని ఈద్గాహ్ విస్తరించేందుకు విరాళమివ్వాలని చెప్పాడు. దగ్గరి బంధువులకు మాత్రమే చెప్పిన విషయం పిల్లలకు తెలియదు. అలా జనవరి 2003లో తండ్రి మరణాంతరం ఢిల్లీ, మీరట్ వెళ్లిపోయిన సరోజ్, అనితాలకు రీసెంట్ గా ఈ విషయం తెలిసింది.

Read Also: ఉగ్రదాడిలో ఆలయం ధ్వంసం : హిందూ-ముస్లిం కలిసి కట్టారు

దాంతో కాశీపూర్ లో ఉండే రాకేశ్ రస్తోగీ అనే సోదరుడ్ని వెంటనే కాంటాక్ట్ అయ్యారు. చివరి కోరికను తెలియజేయడంతో అతను కూడా ఒప్పుకుని విరాళమిచ్చేందుకు సిద్ధమయ్యాడు.

“తండ్రి చివరి కోరికను తీర్చడం మా బాధ్యత. నా సోదరీమణులు అతని ఆత్మకు శాంతి చేకూరే పనిచేశారు” అని రస్తోగీ అన్నారు.

“ఇద్దరు సోదరీమణులు మతాంతర యూనిటీకి ఉదాహరణగా నిలిచారు. ఇంతటి ఉన్నతమైన పనికి ఈద్గాహ్ కమిటీ తమ కృతజ్ఞతను తెలియజేశారు. వాళ్లు చేసిన పనికి త్వరలోనే అభినందనలు తెలియజేస్తామని” ఈద్గాహ్ కమిటీకి చెందిన హసీన్ ఖాన్ వెల్లడించారు.