ఉగ్రదాడిలో ఆలయం ధ్వంసం : హిందూ-ముస్లిం కలిసి కట్టారు

ఉగ్రదాడిలో ఆలయం ధ్వంసం : హిందూ-ముస్లిం కలిసి కట్టారు

పుల్వామా ఘటన కశ్మీర్ ప్రజలనే కాదు.. భారత్.. పాక్ ఇరు దేశాలను కుదిపేసింది. పలు  చర్చలతో పాటు కవ్వింపు చర్యల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి 14న పాక్ నిషేదిత గ్రూపు జైషే మొహమ్మద్ పాల్పడిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లతో పాటు అక్కడి ప్రదేశాలు కూడా గల్లంతైయ్యాయి. పుల్వామా జిల్లాలోని పురాతన ఆలయాల్లో ఒకటైన శివాలయం పూర్తిగా పాడైపోయిందట.

అచాన్ గ్రామంలో ఉన్న 80ఏళ్ల నాటి పురాతన దేవాలయం దెబ్బతింది. 1990 కాలంలో జరిగిన మత సంఘర్షణల కారణంగా ఆ గ్రామంలో ఉంటున్న చాలా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. అప్పటి నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిలిచిపోయి గుడి మూతపడింది. దానిని బాగు చేయాలని భావించిన హిందువులతో పాటు ఈ మరమ్మతుల పనుల్లో కశ్మీరీ ముస్లింలు కూడా చేతులు కలిపారట. 

ఈ మేర గుడి ప్రాంగణాన్ని, అందులో ఉన్న శివలింగానికి మార్పులు చేసేందుకు పూనుకున్నారు. మహా శివరాత్రికి ముందు నుంచే పనులు ప్రారంభించి పండుగ రోజు హిందూ-ముస్లింలు కశ్మీరీ కెహ్వా టీను కూడా పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పనులన్నీ స్థానిక సూపర్ వైజర్ భూషణ్ లాల్‌తో పాటు అఖఫ్ పర్యవేక్షిస్తున్నారు. 

గ్రామస్థుడైన మొహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. ఈ పనుల్లో మేం పూర్తిగా మునిగిపోయాం. ముందుగా గ్రౌండ్‌ను లెవెలింగ్ చేసి పెయింట్లు వేసి గేట్ ఏర్పాటు చేస్తాం. పై కప్పును కూడా త్వరలో ఏర్పాటు చేసుకుంటాం. మళ్లీ పాత రోజులు రావాలని కోరుకుంటున్నాం. మేం సోదరుల్లా భావించే పండితులును, వారి కుటుంబాలను గ్రామానికి తిరిగి రమ్మని పిలుస్తాం’ అని వెల్లడించాడు.