HIT 2: హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో జెట్ స్పీడుగా దూసుకొస్తున్న అడివి శేష్ మూవీ!
టాలీవుడ్లో సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఆ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్గా రిలీజ్ అయ్యింది ‘హిట్-2’. దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో వరుసగా ‘హిట్’ సినిమాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సెకండ్ కేస్‌గా మనముందుకు వచ్చిన హిట్-2 ప్రేక్షకులను అలరించడంలోనూ సక్సెస్ అయ్యింది.
HIT 2: టాలీవుడ్లో సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఆ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్గా రిలీజ్ అయ్యింది ‘హిట్-2’. దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో వరుసగా ‘హిట్’ సినిమాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సెకండ్ కేస్‌గా మనముందుకు వచ్చిన హిట్-2 ప్రేక్షకులను అలరించడంలోనూ సక్సెస్ అయ్యింది.
Hit 2 Movie Success Tour : హిట్ 2 టీం సక్సెస్ టూర్..
ఈ హిట్-2 మూవీలో యంగ్ హీరో అడివి శేష్ పవర్ఫుల్ కాప్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. తనదైన యాటిట్యూడ్‌తో ఆయన ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక దర్శకుడు ఈ సినిమాలోని ట్విస్టులను చివరివరకు మెయింటెయిన్ చేస్తూ రావడంతో ఈ సినిమాను ఆసక్తిగా తిలకిస్తూ వచ్చారు ఆడియెన్స్. థియేటర్ల వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న ‘హిట్-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
HIT 2: ఆరు రోజుల్లోనే అన్ని చోట్లా లాభాలను తెచ్చిపెట్టిన హిట్-2
అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిట్-2 సినిమాను జనవరి ఫస్ట్ వీక్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా నిజంగానే జనవరి మొదటి వారంలో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందా లేక మరికొంత సమయం తీసుకుంటుందా అనేది చూడాలి.