Honor Play 40C Launch : భారీ బ్యాటరీతో హానర్ ప్లే 40C ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Honor Play 40C Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? హానర్ ప్లే 40C కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మొత్తం 3 డిఫరెంట్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర ఎంత ఉంది? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?

Honor Play 40C Launch : భారీ బ్యాటరీతో హానర్ ప్లే 40C ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Honor Play 40C With Snapdragon 480 SoC, 5,200mAh Battery Launched

Honor Play 40C Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త హానర్ ప్లే 40C ఫోన్ లాంచ్ అయింది. ముందుగా చైనా మార్కెట్లో (Honor Play 40C) లాంచ్ కాగా.. కంపెనీ ప్లే 40 సిరీస్‌కి లేటెస్ట్ ఎడిషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విభిన్న కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది.

ఈ హ్యాండ్‌సెట్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 480 SoC ద్వారా పవర్ అందిస్తుంది. హానర్ ప్లే 40C ఫోన్ 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హానర్ ప్లే 40C మ్యాజిక్ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.1పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

Read Also : Airtel Xstream AirFiber 5G : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ 5G డివైజ్.. ఇకపై ఇంట్లోనే ఈజీగా 5G హాట్‌స్పాట్ క్రియేట్ చేయొచ్చు..!

హానర్ ప్లే 40C ధర ఎంతంటే? :
హానర్ ప్లే 40C ఫోన్ ఏకైక 6GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 899 (దాదాపు రూ. 10,300) లాంచ్ అయింది. ఈ ఫోన్ RAM విస్తరణ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు 5GB వరకు ఉపయోగించని ఇంటర్నల్ స్టోరేజీని అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఆ మెమెరీని వర్చువల్ RAM మాదిరిగా ఉపయోగించవచ్చు. హానర్ హ్యాండ్‌సెట్ మ్యాజిక్ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. హానర్ చైనా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది.

Honor Play 40C With Snapdragon 480 SoC, 5,200mAh Battery Launched

Honor Play 40C With Snapdragon 480 SoC, 5,200mAh Battery Launched

హానర్ ప్లే 40C స్పెసిఫికేషన్లు :
కొత్తగా లాంచ్ అయిన హానర్ ప్లే 40C ఫోన్ Android 13-ఆధారిత MagicOS 7.1ని రన్ అవుతుంది. డ్యూయల్ SIM సపోర్టును అందిస్తుంది.1612×720 పిక్సెల్స్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా అందిస్తుంది. 6GB RAMతో చేసిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 480 SoC, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ, Adreno 619తో రానుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానరే ప్లే 40C ఫోన్ 13MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్ 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. అదనంగా, బయోమెట్రిక్ ఐడెంటిటీ ఫేస్ ఐడెంటిటీ ఫీచర్ కలిగి ఉంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రొగ్సామిటీ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. హానర్ ప్లే 40C ఫోన్ 163.32×75.07×8.35mm కొలతలు, 188 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Threads Usage Drop : ‘థ్రెడ్స్’ బోర్ కొట్టేసిందిగా.. కేవలం 10 రోజుల్లోనే 50 శాతం తగ్గిన వాడకం.. రోజుకు 10 నిమిషాలే వాడుతున్నారట..!