Threads Usage Drop : ‘థ్రెడ్స్’ బోర్ కొట్టేసిందిగా.. కేవలం 10 రోజుల్లోనే 50 శాతం తగ్గిన వాడకం.. రోజుకు 10 నిమిషాలే వాడుతున్నారట..!

Threads Usage Drop : ట్విట్టర్ పోటీదారు థ్రెడ్స్ (Threads) కేవలం 10 రోజుల్లోనే 150 మిలియన్ల డౌన్‌లోడ్‌లను పొందింది. అంతేవేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్.. రోజువారీ వినియోగంలో దాదాపు 50 శాతం తగ్గుదలని ఎదుర్కొంటోంది. థ్రెడ్స్ యాప్ వినియోగదారులు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌పై రోజుకు 10 నిమిషాలు మాత్రమే గడుపుతున్నారు.

Threads Usage Drop : ‘థ్రెడ్స్’ బోర్ కొట్టేసిందిగా.. కేవలం 10 రోజుల్లోనే 50 శాతం తగ్గిన వాడకం.. రోజుకు 10 నిమిషాలే వాడుతున్నారట..!

People are already bored of Meta’s Twitter rival Threads as daily usage drops by 50 per cent in just 10 days

Threads Usage Drop : ట్విట్టర్ పోటీదారు థ్రెడ్స్ (Threads) కేవలం 10 రోజుల్లోనే 150 మిలియన్ల డౌన్‌లోడ్‌లను పొందింది. అంతేవేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్.. రోజువారీ వినియోగంలో దాదాపు 50 శాతం తగ్గుదలని ఎదుర్కొంటోంది. థ్రెడ్స్ యాప్ వినియోగదారులు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌పై రోజుకు 10 నిమిషాలు మాత్రమే గడుపుతున్నారు. ఈ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కూడా యూజర్ బేస్ పెంచడానికి (Meta) కంపెనీ Twitter తరహాలో మరిన్ని ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్‌లలో బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ తర్వాతి ప్రాంతాల్లో భారత్ ముందుంది.

థ్రెడ్స్ యాప్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా ఆకర్షించడంలో విఫలమైంది. నివేదికల ప్రకారం.. ప్రారంభంలో వినియోగదారులు (Twitter) నుంచి థ్రెడ్స్‌కు మారారు. యాప్ కేవలం 10 రోజుల వ్యవధిలో 150 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను పొందింది. దాంతో థ్రెడ్స్ రోజువారీ వినియోగం దాదాపు 50 శాతం పడిపోయింది. ఈ ప్లాట్‌ఫారమ్ రోజువారీ వినియోగం గణనీయంగా తగ్గింది. వినియోగదారులు ఇప్పుడు మునుపటి 20 నిమిషాలతో పోలిస్తే.. రోజుకు 10 నిమిషాలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. సెన్సార్ టవర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. జూలై 5న లాంచ్ అయినప్పటి నుంచి థ్రెడ్స్ రోజువారీ యాక్టివ్ యూజర్‌లు సుమారుగా 20 శాతానికి పడిపోయారు.

Read Also : Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంకు కార్డులపై 10శాతం తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రోజువారీ యాక్టివ్ యూజర్‌లలో ప్రపంచవ్యాప్తంగా 25 శాతం కన్నా ఎక్కువ తగ్గుదల చవిచూసింది. అదనంగా, థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌పై యూజర్లు గడిపే సమయం 50 శాతానికి పైగా తగ్గింది. థ్రెడ్స్ యాప్ ప్రారంభ రోజులే అని గమనించడం ముఖ్యం. ఈ ప్లాట్‌ఫారమ్ కంపెనీ మెటా.. భవిష్యత్తులో ట్విట్టర్ తరహాలో మరిన్ని ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మరింత మంది వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. థ్రెడ్స్ రోజువారీ వినియోగాన్ని పెంచుతుంది. థ్రెడ్స్ కంపెనీ ప్రతినిధి ప్రస్తుత సవాళ్లను అంగీకరించారు. స్టేబుల్ పర్ఫార్మెన్స్ అందించడమే లక్ష్యంగా కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టనున్నట్టు థ్రెడ్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాబోయే నెలల్లో వినియోగదారు అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడంపై దృష్టిపెడతామని స్పష్టం చేశారు.

People are already bored of Meta’s Twitter rival Threads as daily usage drops by 50 per cent in just 10 days

People are already bored of Meta’s Twitter rival Threads as daily usage drops by 50 per cent in just 10 days

థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్‌ల పరంగా గ్లోబల్ డౌన్‌లోడ్‌లలో 33 శాతం వాటాతో భారత్ అగ్రగామిగా (data.ai) నుంచి డేటా అందిస్తోంది. బ్రెజిల్ 22 శాతంతో యునైటెడ్ స్టేట్స్ 16 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా.. ట్విట్టర్ CEO, ఎలన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రపంచ వినియోగం 3.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అదనంగా ట్విట్టర్ సమీప భవిష్యత్తులో ప్రొఫైల్ పేజీ వ్యూల నుంచి యాడ్ రాబడిని షేర్ చేయాలని యోచిస్తోంది. యాడ్స్ రాబడిలో గణనీయమైన 50 శాతం తగ్గుదల కనిపించింది. గతం కన్నా గణనీయమైన రుణాలతో ట్విట్టర్ ఇప్పటికీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని ఎలన్ మస్క్ ఇటీవలే అంగీకరించారు.

మెటా థ్రెడ్స్ సైన్-అప్ పరంగా చెప్పుకోదగ్గ మైలురాయిని సాధించినప్పటికీ.. ప్లాట్‌ఫారమ్ రోజువారీ వినియోగం గణనీయమైన క్షీణతను చవిచూసింది. అయినప్పటికీ, మరిన్ని ట్విట్టర్ లాంటి ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా ప్రణాళికలతో రోజువారీ వినియోగంలో మార్పులు తీసుకు రానుంది. థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్‌లలో భారత్ ముందుంది. బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇంతలో, యాడ్స్ రాబడి తగ్గుదల, గణనీయమైన రుణాలతో ట్విట్టర్ సొంత సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది.

Read Also : Airtel Xstream AirFiber 5G : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ 5G డివైజ్.. ఇకపై ఇంట్లోనే ఈజీగా 5G హాట్‌స్పాట్ క్రియేట్ చేయొచ్చు..!