Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు

ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.

Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు

Child Reunited

Child Reunited: ఆసుపత్రిలో పిల్లలు తారుమారైన ఘటనలు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అలా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మారిపోయిన చిన్నారి మూడేళ్ల తర్వాత సొంత తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన అసోంలో జరిగింది. బార్పేట జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి కాలేజీలో నజ్మా ఖానమ్ అనే మహిళ 2019, మే 3న ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే బాబు పుట్టిన తర్వాత శ్వాస సంబంధిత సమస్య రావడం, చిన్నారి కండిషన్ సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చేర్చారు.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

తర్వాత ఆ బాబు మరణించాడని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది, ఒక బాబు మృతదేహాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అయితే, ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. తర్వాత ఎందుకో అనుమానం వచ్చిన నజ్మా ఖానమ్ దంపతులు ఆసుపత్రి చేరుకుని రికార్డులు పరిశీలించారు. అప్పుడే వాళ్లకు ఒక విషయం అర్థమైంది. అదే రోజు తన పేరుకు దగ్గరగా ఉన్న నజ్మా ఖాటుమ్ అనే పేరుతో ఉన్న మరో మహిళ కూడా బాబుకు జన్మనిచ్చినట్లు తెలిసింది. అంతకుముందే.. మరణించింది తమ బాబు కాదని నమ్ముతున్న నజ్మా ఖానమ్ దంపతుల అనుమానానికి మరింత బలం చేకూరింది. వెంటనే అది తమ బిడ్డో కాదో తేల్చుకోవాలనుకున్న నజ్మా ఖానమ్ దంపతులు కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించింది.

National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

ఈ ఫలితాల్లో నజ్మా ఖాటుమ్ దగ్గర పెరుగుతున్నది, నజ్మా ఖానమ్ బాబు అని తేలింది. ఆ రోజు మరణించింది నజ్మా ఖాటుమ్ బాబు. కానీ, ఆసుపత్రి సిబ్బంది పేరు విషయంలో పొరపడి నజ్మా ఖాటుమ్ బాబును, నజ్మా ఖానమ్‌కు అప్పగించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో మూడేళ్ల చిన్నారి చివరకు కన్న తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఆ దంపతులు మూడేళ్ల పోరాటం ఫలించింది. కాగా, ఈ అంశంపై నజ్మా ఖాటుమ్ భర్త మాట్లాడుతూ.. తమ దగ్గర ఉన్నది సొంత బిడ్డే అనుకున్నామని, అందువల్లే డీఎన్ఏకు అంగీకరించామని తెలిపాడు. ఇలా జరగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.