Houses Rates : హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు

హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు పెరిగాయి. గత ఏడాదితో క్యూ1తో పోలిస్తే.. 2021 జనవరి నుంచి మార్చి (క్యూ1)లో హైదరాబాద్ ఇళ్ల ధరలు 5శాతం, చెన్నైలో 8శాతం వృద్ధి చెందాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభమయ్యాయి.

Houses Rates : హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు

Houses Rates High In Hyderabad City

Houses Rates High in Hyderabad City : హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు పెరిగాయి. గత ఏడాదితో క్యూ1తో పోలిస్తే.. 2021 జనవరి నుంచి మార్చి (క్యూ1)లో హైదరాబాద్ ఇళ్ల ధరలు 5శాతం, చెన్నైలో 8శాతం వృద్ధి చెందాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభమయ్యాయి. 71,963 గృహాలను విక్రయించినట్టు నైట్ ఫ్రాంక్ క్యూ1 నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, చెన్నై కాకుండా దేశంలోని ఇతర మెట్రోలన్నింట్లోనూ గృహాల ధరలు భారీగా తగ్గిపోయాయి.

తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ పన్ను రాయితీలు విక్రయాల వృద్ధికి కారణమని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 9,349 యూనిట్లు ప్రారంభమయ్యాయి. 2020 క్యూ4లో 7,170, క్యూ3లో 1,234, క్యూ2లో 1,420 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020 క్యూ1తో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ1 నాటికి 211 శాతం లాంచింగ్స్‌లో వృద్ధి నమోదైంది. విక్రయాల గణాంకాలు చూస్తే.. నగరంలో 2021 క్యూ1లో 6,909 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ4లో 3,651, క్యూ3లో 1,609, క్యూ2లో 974 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ1 నాటికి సేల్స్‌లో 81 శాతం వృద్ధిని సాధించింది.

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ1లో 76,006 యూనిట్లు ప్రారంభమయ్యాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే.. 38 శాతం వృద్ధి. గతేడాది క్యూ4లో లాంచింగ్స్‌ 55,033, క్యూ3లో 31,106, క్యూ2లో 5,584 యూనిట్లుగా ఉన్నాయి. 2021 క్యూ1లో 71,963 యూనిట్లు, గత ఏడాది క్యూ1తో పోలిస్తే 44 శాతం ఎక్కువగా కనిపిస్తోంది. 2020 క్యూ4లో 61,593 యూనిట్లు, క్యూ3లో 33,403, క్యూ2లో 9,632 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో గృహాల ప్రారంభం, విక్రయాలలో ముంబై, పుణే నగరాలు టాప్‌ స్థానంలో నిలిచాయి. ముంబైలో 31,515 యూనిట్లు ప్రారంభమయ్యాయి. పుణేలో 18,042 యూనిట్లయ్యాయి. బెంగళూరులో 7,467, చెన్నైలో 2,981, అహ్మదాబాద్‌లో 3,977, ఎన్‌సీఆర్‌లో 1,626, కోల్‌కతాలో 1,439 యూనిట్లు ప్రారంభమయ్యాయి.