Health insurance : ఒకరికి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం?వయస్సు,అలవాట్లను బట్టి తీసుకోవాల్సిన కవరేజ్ వివరాలు,నిపుణుల సూచనలు

చిన్నపాటి అనారోగ్య సమస్యలలో ఆస్పత్రికి వెళితే టెస్టులకే వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. ఇక ఏమన్నా పెద్ద వ్యాధిలాంటిది వస్తే ఇక అంతే జీవితాలకు జీవితాలే ఖర్చైపోతాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరమంటున్నారు నిపుణులు.

Health insurance : ఒకరికి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం?వయస్సు,అలవాట్లను బట్టి తీసుకోవాల్సిన కవరేజ్ వివరాలు,నిపుణుల సూచనలు

health insurance policy

Health insurance : హెల్త్ ఇన్సూరెన్స్ (health insurance). ఈరోజుల్లో చాలా చాలా ముఖ్యమైనది. చిన్నపాటి అనారోగ్య సమస్యలలో ఆస్పత్రికి వెళితే టెస్టులకే వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. ఇక ఏమన్నా పెద్ద వ్యాధిలాంటిది వస్తే ఇక అంతే జీవితాలకు జీవితాలే ఖర్చైపోతాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. వ్యాధులకు పేద గొప్పా తేడా లేదు కదా..ఎవరికైనా వస్తాయి. కానీ దీని కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని..వారి వారి అలవాట్లను బట్టి….వారి వయస్సులను బట్టేకాదు..వారు నివసించే ప్రాంతాలను (నగరాలు, మెట్రోపాలిటన్ నగరాలు)బట్టి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పాలసీబజార్ (Policybazaar.com)హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ సింఘాల్(Siddharth Singhal).

ఏ సమయంలో ఎవరికి ఎటువంటి అనారోగ్యం వస్తుందో చెప్పలేం. మారుతున్న జీవనశైలి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పెరుగుతున్న పొల్యుషన్..కొత్త వైరస్ లో దాడులు, దీనికి తోడు వ్యవసనాలు వంటివి ఉంటే ఇక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలంటున్నారు ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని చాలామందికి ఉంటుంది. కానీ ఎంత తీసుకోవాలి..?ఎటువంటిది తీసుకోవాలి..? అనే విషయాలు తెలియదు. ఒకరికి నిజంగా ఎంత కవరేజీ అవసరం అవసరం ఉంటుంది..? అనే విషయాలు తెలియవు. ఇటువంటివి తెలుసుకుంటే మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి బెటర్ కవరేజీని తీసుకోగలుగుతాం. అటువంటివారి కోసం పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ (Policybazaar.com)హెడ్ సిద్ధార్థ సింఘాల్ కీలక సూచనలు ఉపయోగపడతాయి. మరి ఆయన ఏం సూచనలు చేసారో తెలుసుకుందాం..

హెల్త్ ఇన్సూరెన్స్ ను సరైన వయస్సులో తీసుకోవాలని అంటే 30 ఏళ్లలోపు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వయస్సులో ఆరోగ్యం..శక్తి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల సమస్య ఉండదు. దీంతో ప్రీమియం తక్కువగా నిర్ణయమవుతుంది. అంటే అందుబాటు ప్రీమియానికే సమగ్ర కవరేజీతో కూడిన హెల్త్ ప్లాన్ అనేది చిన్న వయసులో ఉన్న అనుకూలమైన విషయమని గుర్తించాలి. కానీ మారుతున్న జీవనశైలితో కొంతమందికి రక్తపోటు, మధుమేహం వంటి వస్తున్నాయి. అలాగే చిన్నవయస్సులోనే గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత ముందుగా హెల్త్ కవరేజీ తీసుకోవటం చాలా చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. వ్యాధులు వచ్చాక తీసుకుంటే అధనపు భారం తప్పదు.

కాగా దీని కోసం ముందుగా తాము నివసించే ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఏ చికిత్సకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవటం కూడా మంచిది. తమకు ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కారణంగా వచ్చే సమస్యలకు చికిత్సా చార్జీలు తెలుసుకుంటే మంచిది. దానిని బట్టి ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయానికి 2 లేదా 3 రెట్ల మొత్తంతో హెల్త్ కవరేజీ తీసుకోవాలన్నది పాలసీ ఎన్షూర్ (Ensure )సహ వ్యవస్థాపకుడు..డైరెక్టర్ ఎం మిశ్రా (Ensure Goyal)సూచించారు.

అలాగే ఒక వ్యక్తి ముంబై, ఢిల్లీ,కలకత్తా, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో నివసిస్తుంటే రూ.10 లక్షలకు కవరేజీ తీసుకోవాలని.. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి ఉంటే రూ.30 లక్షల వరకు కవరేజీ తీసుకోవాల్నది పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ (Policybazaar)హెడ్ సిద్ధార్థ సింఘాల్ సూచించారు. పొగతాగే అలవాటు ఉన్న వారు, లేని వారు సైతం కనీసం రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నది ఇన్సూర్ దేఖో (Business Head of InsuranceDekho )బిజినెస్ హెడ్ పంకజ్ గోయా (Pankaj Goenka)సూచించారు.

అలాగే ఆర్థిక సమస్యలు లేనివారు అయితే రూ.10లక్షలు కంటే ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నారు. ఎక్కువ బీమా హామీ ఉన్న ఆరోగ్యబీమా సాలసిని తీసుకుంటే మంచిదని సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయని దాని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

మెట్రోలో నగరాల్లో జీవిస్తుంటే..బీమా మొత్తం దాదాపు రూ.20లక్షలు వరకు ఉంటుందని సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ సహ వ్యవస్థాపకుడు (Co-founder, SecureNow Insurance Broker)కపిల్ మెహతా (Kapil Mehta)తెలిపారు. దీనికి రెండు ముఖ్యమైన కారణాలు వివరిస్తు..క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు చికిత్స రూ.10నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రెండోది మీరు తీసుకునే బీమాలో బీమా మొత్తం ఉండాలి. వైద్య ద్రవ్యోల్బణం, చికిత్స కోసం భవిష్యత్తులో ఖర్చులు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు. వైద్య ద్రవ్యోల్బణం (medical inflation) సంవత్సరానికి 10 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటుంది. అందుకే రూ. 20 లక్షల అధిక హామీ మొత్తం చాలా సమంజసమైనదని సూచించారు. ధూమపానం చేసేవారు,ధూమపానం చేయనివారు రూ. 20 లక్షల కవర్‌ని కలిగి ఉంటే మంచిదని సూచించారు.