Amazon Pay Wallet : అమెజాన్ పే వ్యాలెట్ ద్వారా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలంటే? ఇదిగో ప్రాసెస్..!

Amazon Pay Wallet : క్లీన్ నోట్ పాలసీ కింద మొత్తం రూ. 2,000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

Amazon Pay Wallet : అమెజాన్ పే వ్యాలెట్ ద్వారా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలంటే? ఇదిగో ప్రాసెస్..!

How to Exchange Rs. 2,000 Currency Notes Using the Amazon Pay Wallet in India

Updated On : June 25, 2023 / 11:18 PM IST

Amazon Pay Wallet : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తమ వినియోగదారులు రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రకటించింది. గత మే 19న క్లీన్ నోట్ పాలసీ కింద దేశంలో మొత్తం రూ. 2,000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. ప్రస్తుతం రూ.2వేల నోట్లను బ్యాంకు అకౌంట్లలో జమ చేసుకోవచ్చు లేదా సెప్టెంబర్ 30లోగా మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

చాలా మంది తమ రూ. 2వేల నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అమెజాన్ తమ యూజర్ల కోసం నోట్లను మార్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. అమెజాన్ అధికారిక ప్రకటన ప్రకారం.. తమ వినియోగదారులకు అమెజాన్ పే బ్యాలెన్స్‌ ద్వారా రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు అనుమతి కల్పిస్తోంది.

Read Also : Amazon Flipkart Summer Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్ సేల్.. ఆపిల్ ఐఫోన్‌ 14పై రూ.12వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌ల సమయంలో మిగిలిపోయిన మొత్తాన్ని Amazon Pay వ్యాలెట్లలో లోడ్ చేయవచ్చు. ఇ-కామర్స్ దిగ్గజం ఖాతాదారులు గరిష్టంగా రూ. 50వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో రూ. 2,000 డినామినేషన్ నోట్లను కూడా ఉండవచ్చు. అమెజాన్ పే వ్యాలెట్ ఉపయోగించి భారత్‌లో రూ. 2వేలు నోటు ఎలా మార్చుకోవాలి.

How to Exchange Rs. 2,000 Currency Notes Using the Amazon Pay Wallet in India

Amazon Pay Wallet : How to Exchange Rs. 2,000 Currency Notes Using the Amazon Pay Wallet in India

కస్టమర్‌లు అమెజాన్ యాప్‌లో వీడియో KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. KYC ప్రాసెస్ పూర్తయిన తర్వాత, కస్టమర్‌లు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ అనంతరం కస్టమర్‌లు డెలివరీ ఏజెంట్‌కి క్యాష్ అందజేయవచ్చు. ఆర్డర్ డెలివరీ ఏజెంట్ కస్టమర్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను వెంటనే అప్‌డేట్ చేస్తారు.

అమెజాన్ పేలో (Amazon Pay) వ్యాలెట్ అప్‌డేట్ చేసిన మొత్తం ఆన్‌లైన్ షాపింగ్ కోసం లేదా QRలను ఉపయోగించి చెల్లించడం, రీఛార్జ్‌లు చేయడం, స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం లేదా (Swiggy), (Zomato) వంటి యాప్‌లలో డిజిటల్ పేమెంట్ల కోసం ఉపయోగించవచ్చు. అమెజాన్ పే బ్యాలెన్స్‌ని రూ.2వేలతో మార్చుకునే లేదా అప్‌డేట్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. KYC కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అందువల్ల, ఎక్స్‌ఛేంజ్‌ని ప్రారంభించే ముందు కస్టమర్‌లు KYC ప్రక్రియను పూర్తి చేయాలి.

Read Also : Amazon 5G Revolution Sale : అమెజాన్ 5G సేల్ : 5G స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్, మరెన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!