Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

సోషల్ మీడియా ప్రపంచంలో సీక్రెట్ అనే మాటే లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ విషయమైనా కూడా పబ్లిక్ అయిపోతూనే ఉంది.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

Facebook Reveals The Most Viewed Content In Us (1)

Lock Facebook: సోషల్ మీడియా ప్రపంచంలో సీక్రెట్ అనే మాటే లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ విషయమైనా కూడా పబ్లిక్ అయిపోతూనే ఉంది. ముఖ్యంగా ఫేస్‌బుక్ లాంటి ఓపెన్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రైవసీ అనేదే లేకుండా పోయింది. ఫ్రెండ్ లిస్ట్‌లో లేని యూజ‌ర్లు కూడా ప్రొఫైల్ చూసేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ల ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్‌, పోస్టులు, బ‌యోడేటా చూసేస్తున్నారు.

అటువంటి పరిస్థితికి చెక్ పెట్టొచ్చు.. మన ప్రొఫైల్ స్నేహితులకు తప్ప మరెవరికీ కనిపించకుండా ఉండేందుకు Lock Profile అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఆ ఆప్షన్ విషయానికి వస్తే..ఫేస్‌బుక్ కొత్త ఫీచ‌ర్‌లో ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవ‌డం.. ఫ్రెండ్ లిస్టులో ఉన్న‌వాళ్లు త‌ప్పితే మిగిలినవారు ఎవ్వ‌రూ ఆ పేజీని యాక్సెస్ చేసుకునే వీలు ఉండ‌దు. దీని వ‌ల్ల‌ ఫ్రెండ్ లిస్టులో లేని వాళ్లు లాక్ చేసుకున్న ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను చూసే పరిస్థితి ఉండదు.

ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేసి యాడ్ టు స్టోరీ(Add to Story) అనే ఆప్ష‌న్ ప‌క్క‌నే ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్క‌డ Lock Profile అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే.. ప్రొఫైల్ లాక్‌కు సంబంధించిన సూచ‌న‌లు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకుంటే.. You Locked Your Profile అనే పాప్అప్ క‌నిపిస్తుంది.

ఐఓఎస్‌లో ఫేస్‌బుక్ యాప్‌లో ప్రొఫైల్ లాక్‌కు సంబంధించిన ఆప్ష‌న్స్ అందుబాటులో లేవు.

బ్రౌజర్ ద్వారా అయితే.. ఫేస్‌బుక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి సీ యువ‌ర్ ప్రొఫైల్ ఆనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక‌.. మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఒక డ్రాప్‌డౌన్ మెను ఓపెన్ అవుతుంది. అక్కడ లాక్ ప్రొఫైల్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అకౌంట్ లాక్ అవుతుంది.