WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ యాప్‌లలో ఒకటి. మిలియన్ల కొద్దీ రోజువారీ యాక్టివ్ యూజర్‌లతో అత్యధికంగా వాట్సాప్ వినియోగిస్తున్నారు.

WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Tips _ How to restore deleted WhatsApp photos and videos

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ యాప్‌లలో ఒకటి. మిలియన్ల కొద్దీ రోజువారీ యాక్టివ్ యూజర్‌లతో అత్యధికంగా వాట్సాప్ వినియోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో ఒకరితో ఒకరు చాట్ చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్‌లను కూడా షేర్ చేసుకోవచ్చు. కానీ స్టోరేజ్ సమస్య కారణంగా చాలా మంది వాట్సాప్ యూజర్లు పెద్ద వాట్సాప్ ఫైల్‌లను తొలగిస్తారు.

ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైన ఫోటోలు, వీడియోలను కోల్పోవాల్సి వస్తుంది. మీరు కూడా వాట్సాప్ అకౌంట్లో ఫొటోలు, వీడియోలను కోల్పోయారా? అయతే ఆందోళన చెందొద్దు. ఎందుకంటే డిలీట్ చేసిన ఫైల్‌లను రీస్టోర్ చేసేందుకు ఒక మార్గం ఉంది. ఈ మీడియా ఫైల్‌లను రికవర్ చేసేందుకు WhatsApp ద్వారా ప్రత్యేకమైన ఫీచర్ ఏదీ అందుబాటులో లేదు. యూజర్లు తొలగించిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందగలిగే కొన్ని మార్గాలు ఉన్నాయి. WhatsAppలో తొలగించిన ఫోటోలు, వీడియోలను యూజర్లు ఎలా తిరిగి పొందవచ్చో నిశితంగా పరిశీలించండి.

WhatsApp Tips _ How to restore deleted WhatsApp photos and videos

WhatsApp Tips _ How to restore deleted WhatsApp photos and videos

WhatsApp అన్ని ఫోటోలను ఫోన్ గ్యాలరీలో Save చేయవచ్చు :
WhatsApp డిఫాల్ట్‌గా ఫోన్ గ్యాలరీలో అన్ని ఫోటోలు, వీడియోలను సేవ్ చేస్తుంది. మీరు ఏదైనా మీడియా ఫైల్ పంపిన తర్వాత చాట్ నుంచి తొలగిస్తే.. ఆయా ఫోటోలు iOS డివైజ్ గ్యాలరీ, Google ఫోటోలు లేదా ఫొటోలలో Save అవుతుంటాయి. Google Drive లేదా iCloud నుంచి WhatsApp బ్యాకప్‌ని రీస్టోర్ చేయవచ్చు. WhatsApp ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Google Driveలో iOS యూజర్ల కోసం iCloudలో చాట్‌లు, మీడియాను బ్యాకప్ అందిస్తుంది. రోజువారీ బ్యాకప్ తర్వాత మీడియా తొలగిస్తే.. మీరు మీ డివైజ్‌లోని Google Drive లేదా iCloud నుంచి బ్యాకప్‌ను రీస్టోర్ చేయవచ్చు. తద్వారా వాట్సాప్ డిలీట్ మీడియా ఫైల్‌లను రీస్టోర్ చేయవచ్చు.

* మీ డివైజ్‌లో WhatsAppని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి.
* అదే ఫోన్ నంబర్‌తో సెటప్ చేయండి.
* బ్యాకప్ నుంచి డేటా రీస్టోర్ సెటప్ చేస్తే.. ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. దానిని Allow చేయండి.
* సెటప్ పూర్తయిన తర్వాత విజయవంతంగా బ్యాకప్ అవుతుంది.
* అన్ని మీడియా, చాట్స్ డివైజ్‌లో రీస్టోర్ చేయవచ్చు.

Read Also : Bluetooth Devices Hack : బ్లూటూత్ వాడుతున్నారా? బ్లూబగ్గింగ్‌తో మీ డివైజ్‌లు జాగ్రత్త.. హ్యాకర్లు మీ డేటాను హ్యాక్ చేయొచ్చు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!

WhatsApp మీడియా ఫోల్డర్‌ను చెక్ చేయండి :
* మీడియా ఫోల్డర్ నుంచి WhatsApp మీడియాను రీస్టోర్ చేసే ఆప్షన్ Android యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంది.
* ఫైల్ ఎక్స్‌ప్లోరర్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* రూట్ డైరెక్టరీలో WhatsApp ఫోల్డర్‌కు వెళ్లండి.
* అందులోని మీడియా ఫోల్డర్ WhatsApp Images ఫోల్డర్‌కి వెళ్లండి.
* మీరు అందుకున్న అన్ని ఫొటోలను ఈ ఫోల్డర్‌లో చూస్తారు.
* పంపిన ఫోల్డర్‌కి వెళ్లండి. మీరు డిలీట్ చేసిన ఫొటో లేదా మీడియాను కనుగొనవచ్చు.

WhatsApp Tips _ How to restore deleted WhatsApp photos and videos

WhatsApp Tips _ How to restore deleted WhatsApp photos and videos

Turn off Delete Media option From Gallery :
మీరు WhatsApp చాట్ నుంచి డేటాను డిలీట్ చేసేటప్పుడు ఫోన్ గ్యాలరీ నుంచి డిలీట్ కాకుండా చేయవచ్చు. WhatsApp మీడియాలో మాత్రమే డేటాను డిలీట్ చేయవచ్చు. అందుకోసం ‘Device Gallery’ చాట్‌లో మీడియాను డిలీట్ చేసే ఆప్షన్ OFF చేయండి.

* ఏదైనా WhatsApp చాట్‌ని ఓపెన్ చేయండి.
* మీడియాను ఎంచుకుని, Delete icon నొక్కండి.
* WhatsApp మీ 4 ఆప్షన్లను ప్రాంప్ట్ చేస్తుంది.
* డివైజ్ గ్యాలరీ నుంచి చాట్‌లో పొందిన మీడియాను కూడా Delete చేయండి.
* Delete for everyone ఆప్షన్ ఎంచుకోవచ్చు.
* Delete for Me ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
* లేదంటే Cancel ఆప్షన్ ఎంచుకోండి.
* ఇప్పుడు, ఫోన్ గ్యాలరీ నుంచి మీడియాను డిలీట్ చేసే ఫస్ట్ ఆఫ్షన్ Uncheck చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో ఒక్క నెలలోనే 23 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?