Tech Tips in Telugu : మీ పీసీలో ఓఎస్ ఏదైనా సరే.. సింపుల్‌గా స్ర్కీన్‌షాట్ తీసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

Tech Tips in Telugu : మీరు విండోస్ (Windows, Mac, Linux) OS రన్ అయ్యే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో స్క్రీన్‌షాట్‌ (Screenshots)లను కీబోర్డ్ షార్ట్‌కట్స్ (Keyboard Shortcuts) సాయంతో సులభంగా తీసుకోవచ్చు.

Tech Tips in Telugu : మీ పీసీలో ఓఎస్ ఏదైనా సరే.. సింపుల్‌గా స్ర్కీన్‌షాట్ తీసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

How to Take Screenshots on Laptop or Desktop ( Image Source : Google )

Updated On : October 13, 2024 / 10:59 PM IST

Tech Tips in Telugu : మీ కంప్యూటర్ (PC) లేదా ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ ఎలా తీయాలో తెలుసా? చాలా మంది వినియోగదారులు (Windows, macOS లేదా Linux)లో రన్ అయ్యే కంప్యూటర్‌ను వాడుతుంటారు. అయితే, సాధారణంగా అడిగే ప్రశ్నలలో స్ర్కీన్‌షాట్ గురించే ఎక్కువగా ఉంటుంది.

మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో స్క్రీన్‌షాట్‌లను తీయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. మీ స్క్రీన్ నుంచి క్యాప్చర్ చేసిన ఇమేజ్‌ని క్రాప్ చేయొచ్చు. రొటేట్ చేయడం లేదా ప్రింట్ తీసుకోవచ్చు. అయితే, స్క్రీన్ క్యాప్చర్ ఫంక్షనాలిటీ కోసం మీ కీబోర్డ్‌లోని షార్ట్‌కట్స్ కలిపి నొక్కడం ద్వారా స్క్రీన్‌షాట్ వేగంగా క్యాప్చర్ చేయొచ్చు.

Read Also : Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. భారత్‌లోనే అత్యంత వేగవంతమైన కారు..!

మీ స్క్రీన్‌షాట్‌లపై మరింత కంట్రోల్ పొందడానికి అనేక థర్డ్-పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. చాలా మంది వినియోగదారులు ubuntu వంటి Windows, macOS, Linux-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్నల్ టూల్స్ చాలా ఫీచర్‌లను కలిగి ఉంటాయి. మీకు బహుశా అడ్వాన్స్ టూల్ అవసరం లేదు. ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్‌లను తీయడానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని ఇన్‌బిల్ట్ టూల్స్ ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం..

విండోస్ ఉపయోగించి ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ ఎలా తీయాలంటే? :

☞ మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో క్యాప్చర్ చేయాలనుకుంటున్న యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
☞ స్క్రీన్ మసకబారినట్లు కనిపించే వరకు Windows Logo + Shift + S Keyను కలిపి నొక్కండి.
☞ మీరు స్క్రీన్‌షాట్ తీసే లొకేషన్ ఎంచుకోవడానికి మీ ట్రాక్‌ప్యాడ్ లేదా మౌస్‌ని ఉపయోగించండి లేదా స్క్రీన్ పైభాగంలో ఫుల్‌స్క్రీన్ స్నిప్ ఆప్షన్ ఎంచుకోండి.
☞ మీ స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయడం, కటింగ్, షేరింగ్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి స్నిప్పింగ్ టూల్ (Snipping Tool) నోటిఫికేషన్‌పై Click చేయండి.

MacOS ఉపయోగించి ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? :

☞ మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో క్యాప్చర్ చేసే యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
☞ మొత్తం స్క్రీన్‌ను క్యాప్చర్ చేసేందుకు Shift + Command + 3 Key కలిపి నొక్కండి.
☞ స్క్రీన్‌లోని కొంత భాగాన్ని క్యాప్చర్ చేసేందుకు Shift + Command + 4 నొక్కండి. ఆపై డ్రాగ్ చేసి, అవసరమైన ప్రాంతాన్ని ఎంచుకోండి.
☞ లేటెస్ట్ స్క్రీన్‌షాట్‌ను చూసేందుకు మీ డెస్క్‌టాప్‌ ఓపెన్ చేయండి. లేదంటే మరో యాప్‌కి షేర్ చేయండి.

Linuxని ఉపయోగించి ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్ ఎలా తీయాలి? :
☞ మీరు ubuntu వంటి అడ్వాన్సడ్ Linux OS రన్ చేస్తుంటే.. ప్రింట్ కీ (Print Key)ని నొక్కండి.
☞ మొత్తం స్క్రీన్ లేదా నిర్దిష్ట విండోను వరుసగా క్యాప్చర్ చేయడానికి స్క్రీన్ లేదా విండోను క్లిక్ చేయండి.
☞ స్క్రీన్‌లో కొంత భాగాన్ని క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి.
☞ మీ మౌస్‌ని ఉపయోగించి క్లిక్ చేసి ఆయా ప్రాంతం ఎంపిక అయ్యే వరకు డ్రాగ్ చేయండి.
☞ స్క్రీన్ క్యాప్చర్‌ను చూసేందుకు Images> Navigate to Screenshots లేదా (Ctrl + V)ని ఉపయోగించి ఏదైనా యాప్‌లో Paste చేయండి.

Read Also :SpaceX Launch : స్పేస్ఎక్స్ ఐదో స్టార్‌షిప్‌ ప్రయోగం సక్సెస్.. తిరిగొచ్చిన సూపర్ హెవీ బూస్టర్‌..!