Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. భారత్‌లోనే అత్యంత వేగవంతమైన కారు..!

Maruti Suzuki Fronx : మారుతి కార్లలో ఫ్రాంక్స్ ఎస్‌యూవీ మోడల్ కేవలం 17.3 నెలల్లో 2-లక్షల విక్రయాల మార్కును చేరుకుని కొత్త రికార్డును నెలకొల్పింది.

Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. భారత్‌లోనే అత్యంత వేగవంతమైన కారు..!

Maruti Suzuki Fronx Is Fastest Car In India

Updated On : October 13, 2024 / 9:10 PM IST

Maruti Suzuki Fronx : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) సరికొత్త రికార్డును నెలకొల్పింది. మారుతి కార్లలో ఫ్రాంక్స్ ఎస్‌యూవీ మోడల్ కేవలం 17.3 నెలల్లో 2-లక్షల విక్రయాల మార్కును చేరుకుని కొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్, క్యాబిన్‌తో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. అలాగే, జనవరి 2024లో లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్‌గా గుర్తింపు పొందింది.

Read Also : Honda Activa 7G Launch : హోండా యాక్టివా 7G స్కూటర్ వచ్చేస్తోంది.. 60కి.మీ మైలేజీ, ధర ఎంత ఉండొచ్చుంటే?

ఆ తర్వాత, ఫ్రాంక్స్ ఎస్‌యూవీ రెండవ బెంచ్‌మార్క్‌ను దాటింది. ఫ్రాంక్స్ కారు 10 నెలల్లో మొదటి 1 లక్ష మంది కస్టమర్‌లను గెలుచుకుంది. ఆ తర్వాత మరో లక్ష మందిని చేరింది. కేవలం 7.3 నెలల్లో లక్ష మంది కస్టమర్లను చేరుకుంది. ఈ మైలురాయిపై మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. “ఫ్రాంక్స్ అద్భుతమైన విజయం సాధించింది. మారుతి సుజుకికి కస్టమర్ అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగ్గ 16శాతం వృద్ధితో, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొదటిసారి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది.

టర్బో టెక్-లోడెడ్ క్యాబిన్, మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కూడిన ఫ్యూచర్ ఎస్‌యూవీ, పాడిల్ షిఫ్టర్‌లతో టర్బోచార్జ్డ్ ఇంజన్ ఆప్షన్ కోరుకునే కొనుగోలుదారులకు బెస్ట్ అని చెప్పవచ్చు. డైనమిక్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ముందుగా ఫ్రాంక్స్ మోడల్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లను ఆకర్షణగా నిలిచింది. ఎన్‌సీఆర్, ఢి,ల్లీ ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు మార్కెట్‌లుగా అభివృద్ధి చెందాయి. అదనంగా, ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉంది. థ్రిల్లింగ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే కస్టమర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : EPFO Recruitment 2024 : ఈపీఎఫ్ఓ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ షెడ్యూల్‌.. ముఖ్యమైన గైడ్‌లైన్స్ ఇవే..!