EPFO Recruitment 2024 : ఈపీఎఫ్ఓ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ షెడ్యూల్.. ముఖ్యమైన గైడ్‌లైన్స్ ఇవే..!
EPFO Recruitment 2024 : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హులు. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ 2024 ఇంటర్వ్యూలు రెండు సెషన్‌లతో నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు జరగాల్సి ఉంది.

EPFO Recruitment 2024_ Interview Schedule Released, Check Details
EPFO Recruitment 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2024 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హులు. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ 2024 ఇంటర్వ్యూలు రెండు సెషన్‌లతో నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు జరగాల్సి ఉంది. ముందస్తు సెషన్ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
అధికారిక నోటీసు ప్రకారం.. “పైన పేర్కొన్న ఏదైనా కారణం లేదా మరేదైనా కారణాల వల్ల అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అనుమతించకపోతే వారి ప్రయాణ ఖర్చులకు కమిషన్ ఎలాంటి చెల్లింపులు చేయదు. ఒక అభ్యర్థి షరతులతో ఇంటర్వ్యూకు హాజరైతే, షరతు పూర్తి అయ్యేంత వరకు ప్రయాణ ఖర్చులకు కమీషన్ చెల్లించదు. కాబట్టి, తిరుగు ప్రయాణానికి అభ్యర్థులు సరిపడా డబ్బులను తీసుకువెళ్లడం మంచిది.
ఈపీఎఫ్ఓ రిక్రూట్‌మెంట్ 2024.. ముఖ్యమైన మార్గదర్శకాలివే :
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీ దరఖాస్తులో ఏదైనా తప్పుడు సమాచారం గుర్తిస్తే మీ అభ్యర్థిత్వం తిరస్కరిస్తారు.
- భవిష్యత్తులో జరిగే పరీక్షలు లేదా కమిషన్ లేదా కేంద్ర ప్రభుత్వంతో ఉద్యోగం నుంచి డిబార్ చేయొచ్చు.
- అభ్యర్థులు తప్పనిసరిగా అటెస్టేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి.. పాస్‌పోర్ట్-సైజ్ ఫొటోను అతికించాలి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున రెండు సిగ్నేచర్ ఫొటోలతో పాటు సమర్పించాలి.
- అభ్యర్థులు ఇంటర్వ్యూ బోర్డ్ రివ్యూ కోసం పుస్తకాలు వంటివి కూడా తీసుకురావాలి.
- అభ్యర్థిత్వం టెంపరరీ మాత్రమే. అర్హత ధృవీకరణకు లోబడి ఉంటుంది.
- అభ్యర్థులు ఒరిజినల్ వెరిఫైడ్ కాపీలతో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి
- ఇంటర్వ్యూకి పిలిచిన సమయంలో హైశాలరీతో జాబ్ వస్తుందనే గ్యారెంటీ ఉండదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జీతం ఎంత అనేది నిర్ణయిస్తారు.
- అవుట్‌స్టేషన్ అభ్యర్థులకు పరిమిత రీయింబర్స్‌మెంట్ మినహా ప్రయాణ ఖర్చులు చెల్లించరు.
Read Also : CBSE CTET Exam Date : సీబీఎస్ఈ సీటెట్ ఎగ్జామ్ కొత్త డేట్ ఇదే.. ఈ నెల 16వరకే దరఖాస్తుకు ఛాన్స్..!