Honda Activa 7G Launch : హోండా యాక్టివా 7G స్కూటర్ వచ్చేస్తోంది.. 60కి.మీ మైలేజీ, ధర ఎంత ఉండొచ్చుంటే?

Honda Activa 7G Launch : 2024 ఏడాది డిసెంబర్‌లోనే కొత్త హోండా యాక్టివా 7జీ లాంచ్ కానుందని భావిస్తున్నారు. హోండా యాక్టివా 7జీ మైలేజీ, అనేక ఫీచర్లతో రానుంది. ఈ స్కూటర్‌ను కంపెనీ జనవరి 2025లో లాంచ్ చేయవచ్చు.

Honda Activa 7G Launch : హోండా యాక్టివా 7G స్కూటర్ వచ్చేస్తోంది.. 60కి.మీ మైలేజీ, ధర ఎంత ఉండొచ్చుంటే?

Honda Activa 7G Launch

Updated On : October 13, 2024 / 6:05 PM IST

Honda Activa 7G Launch : భారత మార్కెట్లో అనేక కంపెనీల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టూవీలర్ మార్కెట్లో హోండా యాక్టివా అగ్రస్థానంలో ఉంది. దేశ మార్కెట్లో టాప్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది. హోండా కంపెనీ ఈ స్కూటర్‌కు కొత్త వెర్షన్లు వినియోగదారులను మరింతగా ఆకట్టకుంటుంది. కొత్త జనరేషన్ యాక్టివా స్కూటర్లను ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్స్‌తో తీసుకొస్తోంది. ఇదివరకే 4జీ, 5జీ, 6జీ స్కూటర్లను హోండా లాంచ్ చేయగా, ఈ కొత్త లైనప్‌లో కొత్త మోడల్ ‘యాక్టివా 7G’ అతి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

Read Also : iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.27వేలు తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

2024 ఏడాది డిసెంబర్‌లోనే కొత్త హోండా యాక్టివా 7జీ లాంచ్ కానుందని భావిస్తున్నారు. దేశంలోని పెద్ద ఆటో కంపెనీలలో ఒకటైన హోండా స్కూటర్‌కు వినియోగదారుల నుంచి మద్దతు లభించింది. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మీరు హోండా యాక్టివా 7జీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. హోండా యాక్టివా 7జీ మైలేజీ, అనేక ఫీచర్లతో రానుంది. ఈ స్కూటర్‌ను కంపెనీ జనవరి 2025లో లాంచ్ చేయవచ్చు. స్కూటర్ లాంచ్‌పై అధికారికంగా వెల్లడించలేదు.

హోండా యాక్టివా 7జీ ఫీచర్లు :
మార్కెట్లోకి విడుదల చేసిన హోండా యాక్టివా అన్ని వెర్షన్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు కంపెనీ హోండా యాక్టివా 7జీ వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. యాక్టివా 7జీ వేరియంట్‌లో కూడా మైలేజ్ బాగానే ఇస్తుందని అంటున్నారు. యాక్టివా 7జీ స్కూటర్‌ను ఒక లీటర్ పెట్రోల్‌లో 55 నుంచి 60 కి.మీ వరకు సులభంగా నడపవచ్చని నమ్ముతారు.

కస్టమర్లు స్కూటర్‌లో డిజిటల్ స్క్రీన్, మొబైల్ కనెక్టివిటీ, యూఎస్‌‌బీ ఛార్జర్‌ను కూడా పొందే అవకాశం ఉంది. దాంతో పాటు, ఎల్‌ఈడీ లైట్లు కూడా చూడవచ్చు. పుష్ బటన్ స్టార్ట్, సైలెంట్ స్టార్ట్ వంటి ఇతర అధునాతన ఫీచర్లను కూడా చూడవచ్చు. అల్లాయ్ వీల్స్‌తో పాటు బిగ్ డిస్క్ బ్రేక్‌లు స్కూటర్‌లో ఉండవచ్చు.

హోండా యాక్టివా 7జీ ధర :
అద్భుతమైన ఫీచర్లు, మైలేజీ కోసం హోండా యాక్టివా 7జీని కొనుగోలు చేయవచ్చు. ఈ హోండా యాక్టివా 7జీ స్కూటర్ ధర విషయానికి వస్తే.. రూ. 80వేల నుంచి రూ. 90వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌పై ఫైనాన్స్ ప్లాన్ పొందే అవకాశం ఉంది.

Read Also : iPhone Data Transfer : పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ డేటాను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో టిప్స్ మీకోసం..