Study Abroad : విదేశాల్లో చదువు కోసం వెళ్తున్నారా? ఏజెంట్లను సంప్రదించే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Study Abroad : విదేశాల్లో చదువు కోసం వెళ్లే విద్యార్థులు కొన్ని కన్సల్టెన్సీల చేతుల్లో మోసపోతున్నారు. అంతర్జాతీయ విద్య విషయంలో విద్యార్థులు కన్సల్టెన్సీని ఎంచుకునే ముందు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.

Study Abroad _ Points To Consider Before Approaching Consultancies ( Image Source : Google )
Study Abroad : విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారా? మీరు ఏదైనా కన్సల్టెన్సీలు లేదా ఏజెంట్ల ద్వారా ప్రయత్నిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే.. విదేశాల్లో చదువు కోసం వెళ్లే విద్యార్థులు కొన్ని కన్సల్టెన్సీల చేతుల్లో మోసపోతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ప్రక్రియ గురించి తెలియని వారికి విదేశాలలో చదువుకోవడం సవాలుగా మారుతుంది. అనేక మంది విద్యార్థులు తరచుగా కన్సల్టెన్సీలు లేదా ఏజెంట్ల నుంచి సాయం కోరుతుంటారు.
అనేక కన్సల్టెన్సీలు విశ్వాసనీయమైన సపోర్టు అందిస్తున్నాయి. కానీ, కొందరు ఏజెంట్లు మాత్రం మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడవచ్చు. ఇలాంటి విషయంలో ఏజెంట్లను జాగ్రత్తగా సంప్రదించడం చాలా ముఖ్యం. స్కామ్‌లను నివారించడంతో పాటు అంతర్జాతీయ విద్య విషయంలో విద్యార్థులు కన్సల్టెన్సీని ఎంచుకునే ముందు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
Read Also : Maruti Suzuki Fronx : మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డు.. భారత్‌లోనే అత్యంత వేగవంతమైన కారు..!
రివ్యూలను చెక్ చేయండి :
ఏదైనా కన్సల్టెన్సీని సంప్రదించే ముందు వారి హిస్టరీని పరిశోధించడం చాలా అవసరం. విద్యార్థులు ఆన్‌లైన్ రివ్యూలను తప్పక పరిశీలించాలి. కన్సల్టెన్సీ సేవలను ఉపయోగించిన వ్యక్తుల నుంచి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. పరిచయస్తులు లేదా యూనివర్శిటీ ఫోరమ్‌ల నుంచి ఆఫ్‌లైన్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
కన్సల్టెన్సీ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ :
కన్సల్టెన్సీ చట్టబద్ధతను ధృవీకరించడం కూడా అంతే ముఖ్యం. ఆయా కన్సల్టెన్సీకి ఫిజికల్ ఆఫీసు ఉందా? లీగల్ వీసా పనులను చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఎంతకాలంగా కన్సల్టెన్సీ పనిచేస్తుంది? కూడా తప్పక తెలుసుకోవాలి. అది నిజమో కాదో నిర్ధారణ కోసం నేరుగా కన్సల్టెన్సీ ఆఫీసు వద్దకు వెళ్లి అన్ని వివరాలను చెక్ చేసుకోండి.
వీసా మోసం :
కొన్ని కన్సల్టెన్సీలు డబ్బుకు బదులుగా నకిలీ వీసా డాక్యుమెంట్లను అందించడం ద్వారా వీసా మోసానికి పాల్పడుతున్నాయి. వీసాలు, పాస్‌పోర్ట్‌లను జారీ చేసేందుకు రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లకు మాత్రమే అధికారం ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ సంస్థలను సంప్రదించడంలో కన్సల్టెన్సీలు మీకు మార్గనిర్దేశం చేయగలవు. కానీ, నేరుగా ఎలాంటి చట్టపరమైన డాక్యుమెంట్లను జారీ చేయమని గమనించాలి.
డాక్యుమెంట్ ఫోర్జరీ :
అడ్మిషన్‌ను పొందేందుకు ఫేక్ డాక్యుమెంట్లను సూచించే కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించండి. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. దేశం నుంచి శాశ్వత నిషేధాలు లేదా బహిష్కరణ వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫీజు మోసాలతో జాగ్రత్త :
అంతర్జాతీయ విద్యార్థి టారిఫ్‌ల ముసుగులో తక్కువ రేటుకే ఫీజు చెల్లించేలా ఆఫర్లు గుప్పిస్తుంటారు. ఇలాంటి ఆఫర్ చేసే కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో, ఈ ఫీజులు దొంగిలించిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లిస్తుంటారు. దీని కారణంగా విదేశాల్లో విద్యార్థులు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Read Also : SpaceX Launch : స్పేస్ఎక్స్ ఐదో స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్.. తిరిగొచ్చిన సూపర్ హెవీ బూస్టర్..!