Hrudayame : రానా జీవించేశాడు.. ఏడిపించేశాడు..

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రిలీజ్ కానుంది.

Hrudayame : రానా జీవించేశాడు.. ఏడిపించేశాడు..

Hrudayame Video Song From Aranya

Hrudayame: రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రిలీజ్ కానుంది.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక రీసెంట్‌గా వదిలిన ‘హృదయమే జ్వలించెనే’ అనే వీడియో సాంగ్ చాలా ఎమోషనల్‌‌గా ఆకట్టుకుంటోంది. శాంతను మెయిత్రా ట్యూన్, వనమాలి లిరిక్స్, హరిచరణ్ శేషాద్రి వాయిస్ ఈ పాటకు ప్లస్ అయితే ఏ.ఆర్.అశోకు కుమార్ విజువల్‌ పరంగా చాలా చక్కగా చూపించారు.

Read>>>ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఎమోషనల్‌గా ‘అరణ్య’ ట్రైలర్..

ఇక నటీనటుల విషయానికి వస్తే రానా దగ్గుబాటి ఈ పాటలో జీవించేశాడనే చెప్పాలి. విష్ణు విశాల్, జోయా, శ్రియ తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీగా తెరకెక్కించిన ‘అరణ్య’ మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది.