ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఎమోషనల్‌గా ‘అరణ్య’ ట్రైలర్..

ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఎమోషనల్‌గా ‘అరణ్య’ ట్రైలర్..

Aranya Trailer: రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ARANYA

విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌‌తో స్టార్ట్ అయిన ‘అరణ్య’ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా సాగింది.. ఎన్నాళ్లనుండో అడవితో అనుబంధం ఉన్న మనుషులను రాజకీయ పలుకుబడితో అడవి నుండి దూరం చెయ్యడానికి చేసే ప్రయత్నాలు, వాటిని ఎదుర్కొని అడవిని సంరక్షించడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమా కథ అని క్లుప్తంగా చెప్పారు.

రానా నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో చాలా డిఫరెంట్‌గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎ.ఆర్. అశోక్ కుమార్ విజువల్స్, శాంతను మొయిత్రా, జార్జ్ జోసెఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి మరింత అందం తెచ్చాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీగా తెరకెక్కించిన ‘అరణ్య’ మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది.