Puneeth Rajkumar : కంఠీరవ స్టేడియంకు బారులు తీరిన అభిమానులు

నిన్నటి నుంచి కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూడటానికి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. స్టూడియో బయట వరకు క్యూలైన్స్ ఏర్పాటు చేయడంతో క్యూ లైన్స్ అన్ని

Puneeth Rajkumar : కంఠీరవ స్టేడియంకు బారులు తీరిన అభిమానులు

Kanteerava Studio (1)

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇంకా కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం తర్వాత పునీత్ ని చూడటానికి కంఠీరవ స్టేడియంకి దాదాపు 5 లక్షలకు పైగా అభిమానులు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ ని ఖననం చేశారు. గత రెండు రోజులుగా పునీత్ కుటుంబ సభ్యులు వారి సాంప్రదాయ ప్రకారం సమాధి వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి అభిమానులని అధికారికంగా పునీత్ సమాధి దర్శనానికి అనుమతిచ్చారు.

Trisha : దుబాయ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ గా త్రిష

దీంతో నిన్నటి నుంచి కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూడటానికి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. స్టూడియో బయట వరకు క్యూలైన్స్ ఏర్పాటు చేయడంతో క్యూ లైన్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. అభిమానులు పునీత్ సమాధిని దర్శించి వారి అభిమానాన్ని విభిన్న రకాలుగా చాటుకుంటున్నారు. కొంతమంది అభిమానులు శివరాజ్‌కుమార్‌ ని పరామర్శించి వెళ్తున్నారు. పునీత్‌ దూరమైనప్పటికీ ఆయన అన్న శివ రాజ్‌కుమార్‌ లో పునీత్‌ ని చూసుకుంటామని అంటున్నారు. శివరాజ్ కుమార్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించి ఓదారుస్తున్నారు.

Natyam Movie : ఇండస్ట్రీ టాప్ పీఆర్వోలు వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘నాట్యం’ డైరెక్టర్

కొంతమంది బాల నృత్యకారులు పునీత్ సమాధి వద్ద నృత్యాంజలి సమర్పించారు. కెంగేరి సమీపంలోని నాట్యలోక డాన్స్‌ గ్రూపుకు చెందిన చిన్నారులు ఇలా నాట్యం చేసి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన వారంతా ఆ చిన్నారులని అభినందించారు. ఆ చిన్నారులను తీసుకు వచ్చిన టీం పునీత్‌ బాల డ్యాన్సర్లను ఎప్పుడూ ప్రోత్సహించేవారని తెలిపారు.