Natyam Movie : ఇండస్ట్రీ టాప్ పీఆర్వోలు వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘నాట్యం’ డైరెక్టర్

వంశీ, శేఖర్ లు చాలా వరకు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ప్రమోట్ చేస్తారు. ఇటీవల 'నాట్యం' అనే సినిమాకి పీఆర్వోగా పని చేశారు. ఈ సినిమాని మా దగ్గర డబ్బులు తీసుకొని, సరిగ్గా

Natyam Movie : ఇండస్ట్రీ టాప్ పీఆర్వోలు వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘నాట్యం’ డైరెక్టర్

Natyam

Natyam Movie :  ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి, జనాల దగ్గరికి వివిధ మార్గాల్లో ఆ సినిమాని తీసుకెళ్లడానికి ఉండే వాళ్ళని పీఆర్వో అంటారు. ఇండస్ట్రీలో కొంతమంది టాప్ పీఆర్వోలు ఉన్నారు. వాళ్లలో వంశీ, శేఖర్ ఇద్దరు కలిసి ఒక టీంగా చేస్తారు. వంశీ, శేఖర్ లు చాలా వరకు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ప్రమోట్ చేస్తారు. ఇటీవల ‘నాట్యం’ అనే సినిమాకి పీఆర్వోగా పని చేశారు. మన దేశ నాట్య వైభవం గురించి ఎంతో గొప్పగా చెప్పిన ఈ సినిమాని మా దగ్గర డబ్బులు తీసుకొని, సరిగ్గా ప్రమోట్ చేయకుండా, మాపై నెగిటివ్ రివ్యూలు రాపించారని ఈ సినిమా డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అంతే కాక ఈ వివాదం పై రేవంత్ సినీ ప్రముఖులను, మా అధ్యక్షుడు విష్ణు మంచు, సినీ నిర్మాతల మండలి, డైరెక్టర్ యూనియన్, ఇతర సినీ సంఘాలకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతుంది.

Adipurush Movie : ‘ఆదిపురుష్’లో ప్రభాస్ షూటింగ్ పూర్తి

‘నాట్యం’ సినిమా డైరెక్టర్ రేవంత్. ఈ వివాదంపై ఓ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టారు. రేవంత్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. వంశీ, శేఖర్ మా సినిమాకు పీఆర్వోగా పనిచేశారు. మా సినిమా ప్రమోషన్ సందర్భంగా అన్నీ తప్పుడు బిల్లులు ఇచ్చి భారీగా డబ్బు తీసుకొన్నారు. మా నుంచి డబ్బు తీసుకొని ప్రమోషన్స్‌కు ఖర్చు పెట్టకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారు అని నాట్యం డైరెక్టర్ రేవంత్ ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు మా వద్దకు వచ్చి మీ సినిమాకు ప్రమోషన్స్ చేస్తామని అన్నారు. మీరు ఎంత ఇస్తే అంత తీసుకొంటాం. మనం వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని హడావిడి పెట్టారు. మేము వాళ్ళని నమ్మి మా సినిమాకి పీఆర్వోలుగా పెట్టుకొన్నాం.

Manchu Vishnu : సీనియర్ నటిని ‘మా’ నుంచి బహిష్కరించిన మంచు విష్ణు.. షాక్ లో ‘మా’ సభ్యులు

ప్రమోషన్ మొదలైన తర్వాత వాళ్లు ముందు చెప్పినట్టు కాకుండా మరో రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఏవో బిల్లులు ఇచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మీరు ప్రమోషన్స్‌కు డబ్బులు ఇవ్వరా? ప్రమోషన్స్ చేయోద్దా అని గొడవ పడ్డారు. అయితే మేము ఇచ్చిన డబ్బులు ప్రమోషన్స్‌కు ఉపయోగించడం లేదనే విషయం తెలిసి వాళ్లను అడిగితే మరోసారి గొడవపడ్డారు అని రేవంత్ కోరుకొండ అన్నారు. ‘నాట్యం’ సినిమా రిలీజ్‌కు ముందు మీడియా రిపోర్టర్లను కల్పించండి. మేము వాళ్ళతో మాట్లాడతాము అంటే వాళ్లు మిమ్మల్ని కలవరు, మేమే వారికి కలిసి ప్రమోషన్స్ చేస్తామని భారీగా డబ్బు డిమాండ్ చేశారు. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్ల పేర్లు చెప్పి ప్రమోషన్స్ పేరిట లక్షల్లో డబ్బు తీసుకొన్నారు. డబ్బు తీసుకొన్న తర్వాత ఆ వెబ్‌సైట్స్ మీ సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాస్తే మేము బాధ్యులం కాదని చెప్పారు. నాట్యం సినిమా రిలీజైన గంటల్లోనే మా మూవీకి వ్యతిరేకంగా తొమ్మిది వెబ్‌సైట్లు తప్పుడు రివ్యూలు రాశారు. వంశీ, శేఖర్ చెప్పిన వెబ్‌సైట్లు, వాటి కోసం తీసుకొన్న డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం వంశీ, శేఖర్ కంట్రోల్‌లో ఉండే మీడియా మాత్రమే మాపై నెగిటివ్ గా రాశారు అని రేవంత్ తెలిపారు.

Mega Family : మెగా – అల్లు ఫ్యామిలీల దీపావళి

నేను తొలిసారి దర్శకత్వం చేయాలని నిర్ణయించుకొన్నప్పుడు ఒక మంచి సినిమా తీశాను. నాట్యం అనే కథను మంచి కాన్సెప్ట్‌తో ఓ మంచి సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని తపన పడ్డాను. నాలుగు సంవత్సరాలు కష్టపడి ఓ సినిమా తీస్తే వంశీ, శేఖర్ లాంటి వాళ్లు నా జీవితాన్ని గంటలో డిసైడ్ చేస్తారా? వంశీ, శేఖర్ నా మీద చేసిన దుష్ప్రచారం, కక్ష్యతో నేను మనోవేదనకు గురయ్యాను. నాకు జరిగిన అన్యాయానికి తలదించుకొని తప్పు అని వెళ్లిపోవడానికి నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు. సినిమా వల్ల ఏదైన జరిగితే మనోభావాలు దెబ్బతిన్నాయని అందరూ ఎటాక్ చేస్తారు. సినిమా వాడికి అన్యాయం జరిగితే మాత్రం ఎవరూ రారు. ఈ ఫేక్ రివ్యూస్ అనేది నా ఒక్కడి సమస్య కాదు. సినిమా పరిశ్రమలోని ప్రతీ ఒక్కరి సమస్య. కాబట్టి నేను కొత్త దర్శకుడినైనా అందరి తరఫున మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీలో చిన్న సినిమాలే ఎక్కువ, చిన్న నిర్మాతలు, దర్శకులు భయంతో వీళ్ల కంట్రోల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలానే కొనసాగితే రేపు పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అన్నీ కూడా వీళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్ల ప్రభావంతో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బ్యాన్ ఫేక్ రివ్యూస్, బ్యాన్ వంశీ, శేఖర్ పీఆర్వో, సపోర్ట్ నాట్యం అంటూ రేవంత్ కోరుకొండ మాట్లాడిన ఈ వీడియోను రిలీజ్ చేశారు.