Hyderabad: హైదరాబాద్ చిన్నారికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్
హైదరాబాద్‌లో మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్రా తేలుకుంట (8) అనే చిన్నారికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022 దక్కనుంది.

Mountain Rider
Hyderabad: హైదరాబాద్‌లో మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్రా తేలుకుంట (8) అనే చిన్నారికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022 దక్కనుంది. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆఫ్రికా పర్వతాన్ని 2021 మార్చి 6కల్లా ఎక్కేయగలిగింది. కోచ్ భరత్ తమ్మినేనితో కలిసి ఈ ఘనత సాధించడానికి 75రోజుల పాటు శిక్షణ తీసుకుంది.
ఈ అవార్డు గెలుచుకున్న విరాట్ సంతోషంతో పాటు గర్వాన్ని వ్యక్తం చేశారు. గతేడాది ఇదే సమయంలో కఠినంగా శ్రమించి కిల్లీమంజారో సదస్సుకు వెళ్లగలిగా. నా స్నేహితులు, బంధువులు, టీచర్లంతా కంగ్రాచ్యులేట్ చేశారని వివరించింది విరాట్.
తన 16, 13 సంవత్సరాల కజిన్స్ ఉత్తరాఖాండ్ లోని రుదుగైరా పర్వతాలపై నుంచి వీడియో కాల్ చేశారట. అప్పటి నుంచి పర్వతం ఎక్కడమంటే అద్భుతంగా భావించి అక్కడికి తాను కూడా వెళ్లాలని ఆశలు పెంచుకుంది విరాట్. ఇదంతా నెలరోజుల పాటు భరత్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల సాధ్యపడిందట.
Read Also: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!
బూట్స్ అండ్ క్రాంపన్స్ కు ఫౌండర్ అయిన భరత్.. నుంచి నెల రోజుల ట్రైనింగ్ తర్వాతే ఇది సాధ్యమైందని.. చిన్నారి చెబుతుంది. తొమ్మిదేళ్ల వయస్సున్న విరాట్.. అతి చిన్న వయస్సులో ఫీట్ సాధించిన ఘనత నమోదు చేసింది.