Shastri On Dhoni: “ధోని ఫోన్ నంబర్ నా దగ్గర లేదు..” ఆశ్చర్యకర విషయాలు చెప్పిన రవిశాస్త్రి

మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయం వెల్లడించారు.

Shastri On Dhoni: “ధోని ఫోన్ నంబర్ నా దగ్గర లేదు..” ఆశ్చర్యకర విషయాలు చెప్పిన రవిశాస్త్రి

Ravi Sastri

Shastri On Dhoni: మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గురించి భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయం వెల్లడించారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన రవిశాస్త్రి.. తన వద్ద ఎంఎస్ ధోనీ ఫోన్ నంబర్ లేదని, ధోనీ తన దగ్గర ఎప్పుడూ మొబైల్ ఉంచుకోడని, అందుకే ఇప్పటివరకు నెంబర్ తీసుకోలేదని వెల్లడించాడు.

లెజెండ్స్ క్రికెట్ లీగ్ కమీషనర్ రవిశాస్త్రి ఒమన్‌లో షోయబ్ అక్తర్‌తో మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నా దగ్గర ఎంఎస్ (ధోనీ) ఫోన్ నంబర్ లేదు. నేను ఎప్పుడూ అడగలేదు, ఎందుకంటే, ధోనీ తనతో ఎప్పుడూ ఫోన్ తీసుకెళ్లడు.. అది నాకు తెలుసు.. అందుకే ఎప్పుడూ ఫోన్ నంబర్ తీసుకోలేదు” అని చెప్పాడు.

ధోనీ గురించి రవిశాస్త్రి ఇంకా మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో సచిన్ టెండుల్కర్‌తో సహా చాలామంది ఆటగాళ్లను చూశాను.. గమనించాను’. కానీ ధోనీ లాంటి వ్యక్తులు మాత్రం చాలా అరుదు. నేను మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వ్యక్తిని చూడలేదు. సచిన్ చాలా డౌన్ టూ ఎర్త్.. గౌరవంగా ఉంటాడు కానీ అతనికి కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. MS ధోనీలో మాత్రం ఎప్పుడూ కోపం అనేదే చూడలేదు.

Young Players: యువ ఆటగాళ్లతో టీమిండియా.. తొలిసారి రవికి చోటు!

విరాట్ కోహ్లీ మాత్రం మైదానంలో ఫైటర్ లా కనిపిస్తాడు. ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే పోటీపడాల్సిందే అంటాడు. కానీ గ్రౌండ్ బయట మాత్రం పూర్తిగా వ్యతిరేకం. చాలా కూల్‌గా ఉంటాడు. రోహిత్ కూడా ధోనీలాగే కాస్త రిలాక్స్‌డ్‌గా కనిపిస్తాడు. చాలా సార్లు ధోని హావభావాలు అస్సలు అర్థం కావు. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. జీరోకి అవుట్ అయినా, సెంచరీ చేసినా.. వరల్డ్ కప్ సాధించినా ఒకేలా కనిపిస్తాడు.

ఇక ఇదే సమయంలో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, అయితే.. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

India’s squad: వెస్టిండీస్‌తో సిరీస్‌కి టీమిండియాని ప్రకటించిన బీసీసీఐ