ICMR : 2 గంటల్లోనే ఒమిక్రాన్ పరీక్ష ఫలితాలు

కేవలం టెస్టింగ్‌తోనే సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. ఐసీఎంఆర్‌ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు...

ICMR : 2 గంటల్లోనే ఒమిక్రాన్ పరీక్ష ఫలితాలు

Omicron case

New Kit To Detect COVID-19 : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నిర్ధారణకు ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌ లాగా రోజులు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితులు ఉండగా…ఇప్పుడు ఆ అనవసర టైమ్‌కు చరమగీతం పాడాల్సిన సమయం అసన్నమైంది. ఇక 20-20 మ్యాచ్‌ కంటే తక్కువ టైమ్‌లోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిర్ధారించవచ్చు. అవును కేవలం రెండు గంటల్లోనే సదరు కరోనా బాధితుడికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- ఐసీఎంఆర్ ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. కేవలం 2 గంటల సమయంలోనే కొత్త వేరియంట్‌ను నిర్ధారించే టెస్టింగ్‌ కిట్‌ను రూపొందించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Read More : ఆంధ్రప్రదేశ్‌లో తోలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు

చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయట పడుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 33 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను వెంటనే గుర్తించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్ల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతోంది. శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినా అదే సమయం. దీంతో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఈ 5 రోజుల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్‌ నిర్ధారణ ఆలస్యమయ్యే కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోంది. కొత్త వేరియంట్‌ను త్వరగా గుర్తిస్తే ట్రేసింగ్‌ చేయడం ముందుగానే మొదలుపెట్టవచ్చు. దీంతో బాధితుడి ప్రైమరీ కంటెక్ట్స్‌కు త్వరగా కరోనా పరీక్షలు చేయవచ్చు.

Read More : Hyderabad Crime : సెలైన్ బాటిల్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువ వైద్యుడు

ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ ర్యాపిడ్‌-PCR టెస్టింగ్‌ చేస్తున్నారు. ఒకవేళ కరోనాగా నిర్ధారణయితే వాళ్ల శాంపిళ్లను జీనోమ్‌ సిక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లలో కరోనా సోకుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఫలితం ఆలస్యమవుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేవలం టెస్టింగ్‌తోనే సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రానా కాదా అన్న విషయం తెలిసిపోనుంది. ఐసీఎంఆర్‌ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ టెస్టింగ్‌ కిట్‌ను అభివృద్ధి చేశారు. బిశ్వజ్యోతి బొర్గకోటి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తయారు చేసిన టెస్టింగ్ కిట్ ద్వారా శాంపిల్స్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్ధారించవచ్చు. మరోవైపు ఏపీలో వచ్చిన కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 34కు చేరింది.