Radhe Shyam: జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే.. రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్!

ఫ్యాన్స్ రచ్చ చేసే వరకు సైలెంట్ గా ఉన్న రాధేశ్యామ్ మేకర్స్.. ఇప్పుడు కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత వరుసపెట్టి లిరికల్ సాంగ్స్ వదులుతున్నారు.

Radhe Shyam: జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే.. రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్!

Radhe Shyam

Radhe Shyam: ఫ్యాన్స్ రచ్చ చేసే వరకు సైలెంట్ గా ఉన్న రాధేశ్యామ్ మేకర్స్.. ఇప్పుడు కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత వరుసపెట్టి లిరికల్ సాంగ్స్ వదులుతున్నారు. రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ సంచారి కూడా వచ్చేసింది. అనిరుధ్ రవిచందర్ పాడిన ఈ పాటలో క్లాసీ లుక్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసారు డార్లింగ్. సైలెంట్ గా ఉంటే ఎట్లా కాస్త యాక్టివ్ గా ఉండడమ్మా అని ఫ్యాన్స్ చేసిన రచ్చకి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో సమాధానమిస్తున్నారు. ఒకదానివెంట మరొకటి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా లిరికల్ సాంగ్స్ ను అన్ని భాషల్లో వదలుతున్నారు. అవి ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ కి తగ్గట్టే బ్లాక్ బస్టర్ ఈజ్ తో ట్రెండ్ అవుతున్నాయి.

Brahmāstra: ఇంతకీ మీ పెళ్ళెప్పుడు.. అలియా రణ్‌బీర్ ఫన్నీ రియాక్షన్!

ఇదిలా వుంటే ఇప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణ రివీల్ చేసిన సీక్రెట్స్ రాధేశ్యామ్ పై క్రేజ్ మరింత పెరిగేలా చేస్తున్నాయి. రాధేశ్యామ్ మొత్తం సర్ ప్రైజ్ లతో నిండిపోయిందన్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో మెస్మరైజ్ చేయబోతుందనే హింట్ ఇచ్చాడు. మొత్తం 16 క్యారెక్టర్స్ తో నడిచే రాధేశ్యామ్ లో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ కనిపించనుండగా… రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసారు. ఇదే రోల్ లో యాక్టర్ సత్యరాజ్ ను నార్త్ ఆడియెన్స్ చూడబోతున్నారు. ఇక పూజా హెగ్డే ప్రశ్నయితే.. ప్రభాస్ సమాధానంగా నిలుస్తారని.. భారతదేశంలో మొదలయ్యే కథ.. రోమ్, లండన్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందన్నారు. మొత్తంగా మంచు పర్వతంపై కూర్చొని సూర్యస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్టు రాధేశ్యామ్ ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ లో మరింత హీట్ పెంచారు.

Liger: అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన రౌడీహీరో!

రాధేశ్యామ్.. ఇంటెన్స్ లవ్ స్టోరీ. ప్రమోషన్స్ లో మనం చూస్తున్నట్టు విక్రమాదిత్య – ప్రేరణల రొమాన్స్ మాత్రమే కాదు. ఈ కథను లైఫ్ అండ్ డెత్ మధ్య సెలెబ్రేషన్ గా చూపించబోతున్నాడు రాధాకృష్ణ. జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే ఎలా ఉంటుందన్న ఎమోషన్స్ ఇందులో క్యారీచేసారు. జాతకాల్ని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లకి మధ్య ప్రేమను తీసుకొస్తే ఎలా ఉంటుందనేది రాధాకృష్ణ బేసిక్ ఆలోచన. ఇక వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ క్రెడిట్ మొత్తం ప్రభాస్ కే ఇచ్చేశాడు డైరెక్టర్. 15 ఏళ్లుగా రాధేశ్యామ్ కథతో ట్రావెల్ అవుతున్నానని ప్రకటించిన రాథాకృష్ణ.. ఆ కథ పుట్టుక వెనుక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాధేశ్యామ్ రిలీజ్ తోనే రివీల్ అవుతుందని సూపర్ హైప్ తీసుకొచ్చాడు.