Ileana D’Cruz : బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఈ హీరోయిన్ ఇప్పుడు ఇలా ఉందో చూశారా..?
ఇలియానా తాజాగా బేబీ బంప్ తో ఉన్న కొత్త ఫోటోని షేర్ చేసింది. నిండు గర్భిణిగా ఉన్న ఇలియానా ఇప్పుడు ఇలా ఉందో చూశారా..?

Ileana DCruz shares her baby bump pic gone viral
Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అప్పటిలో ఈ భామ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ ఆ న్యూస్ పెద్దగా వినిపించకపోవడంతో అవి రూమర్స్ అని తెలియాయి. ఇక ఇటీవల సడన్ గా ఇలియానా తాను తల్లిని కాబోతున్నాను అంటూ ప్రకటించడంతో అసలు ఈ భామ ఎవర్ని పెళ్లి చేసుకుంది. ఈ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ నెటిజెన్లు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.
Ustaad Trailer : శ్రీసింహ ఉస్తాద్ ట్రైలర్ రిలీజ్.. బైక్.. విమానం.. ప్రేమ..
ఈ ప్రకటన తరువాత ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసినా.. పిక్ బ్లర్ చేసి పేస్ చూపించకుండా పోస్ట్ పెట్టింది. ఇక ఇటీవల డేట్ నైట్ అంటూ ఒక అబ్బాయితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ తన బాయ్ ఫ్రెండ్ అతనే అనుకుంటా, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అయ్యి ఉంటాడని కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలియానా మాత్రం ఇంకా తన రిలేషన్‌షిప్ పై సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే వస్తుంది. ఇది ఇలా ఉంటే, ఇలియానా తాజాగా బేబీ బంప్ తో ఉన్న కొత్త ఫోటోని షేర్ చేసింది.
Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ ట్రైలర్ విడుదల చేసిన దిల్ రాజు..
ఆ ఫొటోలో ఇలియానా నిండు గర్భిణిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల అని సమాచారం. మరో కొన్ని రోజులు ఇలియానా తన చిట్టి బేబీని అందరికి పరిచయం చేయనుంది. ఆ బేబీతో పాటే తన రిలేషన్‌షిప్ పార్ట్నర్ ని కూడా అఫీషియల్ గా పరిచయం చేస్తుందేమో చూడాలి. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన పిక్ చూసిన నెటిజెన్స్ ఆమెకు జాగ్రత్త చెబుతూ.. కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.
View this post on Instagram