IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు… ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు… ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

తాజా ఆదేశాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్, హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, కుమ్రం భీం జిల్లా కలెక్టర్‌గా షేక్ యాసిన్ బాషా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా వెంకట్రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్.హరీష్, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా బదావత్ సంతోష్, నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా వరుణ్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హన్మంతు, మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాజార్షి షా, జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా ఆర్.వి.కర్ణన్,

వనపర్తి జిల్లా కలెక్టర్‌గా తేజస్ పవార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా భారతి హోలికేరి, నియమితులయ్యారు. వీరిలో అమోయ్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.